సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర వరుస సినిమాలతో భారీ  పోటీ నెలకొంది. బడా హీరోల తో పాటు చిన్న హీరోలు కూడా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అయిపోయి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక సంక్రాంతికి విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదనే చెప్పాలి.బడా  హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించారు. అన్ని  సినిమాలు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. వసూళ్ళ పరంగా కూడా అన్ని  సినిమాలు భారీ వసూళ్లు రాబడుతోంది దూసుకుపోతున్నాయి. సంక్రాంతి సీజన్ అంటే  సినిమాలు అన్నింటికీ మార్కెట్ బాగా హెవీగా  ఉంటుంది కాబట్టి... విడుదలైన ప్రతి సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. 

 

 

 అయితే అటు సినీ ప్రేక్షకులు అందరికీ ఈ సంక్రాంతికి  వరుస సినిమా విడుదల తో సినీ  సంక్రాంతి గా మారిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే సినిమాలు... మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలు... స్టైల్  సినిమాలు... ఇలా అన్ని రకాల సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యయి . ఇకపోతే సినిమా విడుదలకు ముందు అందరు హీరోలు ఫ్యాన్స్ కోసం కాస్త అతి చేశారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరో గా  సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. కాక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడం... చిరంజీవి ముఖ్య అతిథిగా రావడాన్ని చిత్రబృందం మొత్తం బాగా హైప్ క్రియేట్ చేయడం.. ప్రేక్షకులకు కాస్త అతిగా అనిపించినట్లు సమాచారం. 

 

 

 అంతేకాకుండా అటు అల్లు అర్జున్ ను  జూనియర్ ఎన్టీఆర్ బావ  అని ట్విట్  చేయడం.. లాంటివి ఫాన్స్ ని బుట్టలో వేసుకోవడానికి చేశారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ బొకే పంపించడం... విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా బట్టలు పంపించడం.. ఇలాంటివి మాత్రం సినీ ప్రేక్షకులకు కాస్త అతిగా కనిపించాయట. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటి వాటితో  కొంత ఆరోగ్యకరమైన వాతావరణం ప్రారంభమైనప్పటికీ.. సినిమా  కోసం ప్రేక్షకులను బుట్టలో వేసుకునేందుకు హీరోలు కాస్త అతి చేశారు అని అక్కడక్కడా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: