నందమూరి హీరో గా వరుస  సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ... ఇప్పటికీ సరైన హిట్ కోసం తహతహలాడుతునే  ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోతున్నాడు. మరోవైపు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ బ్లాక్ బస్టర్  విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో  సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండక్కి దర్బార్, సరిలేరు నీకెవ్వరు,  అలా వైకుంఠపురములో లాంటి భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న బడా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ... కళ్యాణ్ రామ్ మాత్రం తన సినిమా విడుదలను వాయిదా వేసుకోలేదు. 

 

 

 తన సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో.. సంక్రాంతి బరిలోనే తాను నటించిన ఎంత మంచి వాడవురా సినిమాని విడుదల చేశారు. కానీ ఏం లాభం కథ కథనం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఎంత మంచి వాడవురా సినిమా. అప్పటికే స్టార్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీసు వద్ద తీవ్ర పోటీ నెలకొంది... విడుదలైన అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అందరూ ఎక్కువగా బడా హీరోల సినిమాలు చూడ్డానికి ఎక్కువ ఆసక్తి చూపారు. దీంతో  సంక్రాంతి నాడు తన సినిమా ఎంత మంచివాడురా విడుదల చేసి బొక్క బోర్లా పడిపోయాడు కళ్యాన్ రామ్

 

 

 ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందలేక తేలిపోయాడు. సంక్రాంతి సీజన్ లో  ఆలస్యంగా సినిమా విడుదల చేశాడు. అప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న వేరే హీరోల సినిమాల ముందు  మాత్రం తట్టుకోలేకపోయాడు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ కోసం చాలా ట్రై చేశాడు కానీ వర్కవుట్ అవ్వలేదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినప్పటికీ... ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఈ సినిమాకు అంతగా యూస్  అవ్వలేదు. దీంతో తమ్ముడు ఫాలోయింగ్ అన్నకు కలిసిరాక సంక్రాంతికి బొక్క బోర్లా పడిపోయాడు కళ్యాన్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: