ఎవరి ఫేట్ ఎపుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. స్టార్స్ అవుతారు అనుకున్నోళ్లు ఫేడవుట్ అవుతారు. ఫేడవుట్ కు చేరినోళ్లు మళ్లీ బిజీ అవుతుంటారు. నిధి అగర్వాల్ కూడా ఇలాగే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. కెరీర్ ను మళ్లీ ట్రాక్ లోకి ఎక్కిస్తోంది. 

 

నిధి అగర్వాల్ స్లో ఫేజ్ నుంచి బయటపడుతోంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటోంది. మెగా ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అవుతోంది నిధి. వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తోన్న సినిమాలో నిధిని  హీరోయిన్ గా తీసుకుంటున్నారని సమాచారం. 

 

నిధి అగర్వాల్ కు స్టార్టింగ్ లో రెండు సినిమాలతో భారీ షాకులు తగిలాయి. అక్కినేని బ్రదర్స్ తో కలిసి నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో నిధి అగర్వాల్ కొంచెం స్లో అయింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో నిధి కెరీర్ లో కొంచెం మార్పులొచ్చాయి. 

 

నిధి అగర్వాల్ వరుణ్ తేజ్ సినిమాతో పాటు మహేశ్ బాబు మేనల్లుడి సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ తో జోడీ కడుతోంది నిధి. సో ఈ లిస్ట్ చూస్తే నిధి అగర్వాల్ మళ్లీ బిజీ అవుతుందనే చెప్పొచ్చు. మొత్తానికి నిధి అగర్వాల్ సినిమా కెరీర్ బిజీబిజీగా ఉంటోంది. వరుస అవకాశాలు వస్తుండటంతో ఆమె సినీ జీవితం జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఇప్పుడిపుడే పెంచుకుంటున్న నిధి.. రాబోయే సినిమాలతో మంచి పేరు సంపాదించుకోవాలని మనమూ ఆశిద్దాం. ఇప్పటికే స్టార్ హీరోలతో నటించిన నిధి అగర్వాల్ వచ్చే అవకాశాలను ఏదీ వదులుకోవడం లేదు. అంది వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: