సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేసిన విషయం తెలిసిందే.  రజినీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాన్ రామ్  ఈ ఏడాది సంక్రాంతి పండుగ సీజన్ కి పోటీలో నిలిచారు. ఈ ఏడాది పండుగ హిట్స్ మాత్రం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మాత్రమే నిలిచాయి.  వాస్తవానికి రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. తమిళనాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ మంచి హిట్ కావడమే కాదు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  

 

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’.  పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా వచ్చిన  ‘ఎంత మంచివాడవురా’ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు.  తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కళ్యాణ్ రామ్ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.  ఈ సందర్భంగా ‘ఎంత మంచివాడవురా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మొదటిసారి తన సినిమా సంక్రాంతి పండక్కి విడుదల అవుతుంది అంటూ వ్యాఖ్యానించడాన్ని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. గత గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  సినిమా సంక్రాంతికి విడుదలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

 

ఈ మూవీలో ఆయన తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాన్ రామ్ నటించిన విషయం గుర్తుకు చేస్తున్నారు. మెయిన్ హీరో కాకపోయినా.. అప్పట్లో తాను యాక్ట్ చేసిన సినిమా మొదటిసారి సంక్రాంతికి విడుదలవుతుందంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించడంపై నెటిజన్లు రక రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.   ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ డిజాస్టర్ కావడంతో.. ఆ సినిమాలో తాను ఉన్న విషయం మర్చిపోయినట్టుందని అని నెటిజన్స్ జోకులు వేసుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రెటీలు ఏం మాట్లాడినా తప్పులు పడుతూ సెటైర్ వేయడం సర్వ సాధారణం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: