ఇటీవల గత కొద్దికాలంగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని మాస్ మహారాజా రవితేజ కొంత విరామం తీసుకున్న అనంతరం, ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా డిస్కో రాజా. సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయడంలో మంచి పేరున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఎస్ ఎస్ తమన్ స్వరపరిచిన మూడు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందన రాబట్టడం జరిగింది. 

 

ఈనెల 24వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నేడు జరిగిన ఒక మీడియా మీట్ లో సినిమా యూనిట్ వెల్లడించింది. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ, తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని బేస్ చేసుకుని సాగుతోందని, అయితే సినిమాలో మంచి యాక్షన్, ఎమోషన్ తో పాటు మాస్ మహారాజా రవితేజ గారి స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా మిళితం అయి ఉంటుందని అన్నారు. ఇక హీరోయిన్స్ గా నటిస్తున్న నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇద్దరూ కూడా తమ అందం, అభినయంతో కట్టుకున్నారని, 

 

అలానే ఇతర పాత్రల్లో నటిస్తున్న నటీనటులతో పాటు, విలన్ గా నటిస్తున్న బాబీ సింహా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరచారని ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా రేపు రిలీజ్ తర్వాత తమ సినిమా అందరి అంచనాలను అందుకొని తీరుతుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక మొన్న ఈ సినిమా నుండి రవితేజ, బప్పీలహరి పాడిన సాంగ్ కు మంచి స్పందన లభించింది. మరి కొన్నాళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రవితేజకి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: