నట సింహ బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వర్కవుట్ కాకపోవడానికి ఫ్యాన్స్ కారణమా.. నందమూరి అభిమానుల లెక్కలే ఈ క్రేజీ కాంబినేషన్ ని పట్టాలెక్కకుండా చేశాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ బ్లాక్ బస్టర్ మూవీలో నటించాల్సిన బాబాయ్, అబ్బాయ్.. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ వల్లే నటించలేదని స్టార్ డైరెక్టర్ ఓపెన్ అయ్యాడు. 

 

కొందరు స్టార్స్ కలిసి నటిస్తే మహా క్రేజీగా ఉంటుంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ లది అలాంటి మాస్ క్రేజీ కాంబినేషన్. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ వెయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఫ్యాన్స్ భారీ అంచనాల వల్లే ఈ మాస్ కాంబినేషన్ మూవీ వర్కవుట్ కాలేదని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అంటున్నాడు. 

 

బాలకృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయాలని కొరటాల శివ ప్రయత్నించాడట. అయితే కొందరు ఫ్యాన్స్ ఈ స్టార్స్ తో సినిమా అంటే క్యారెక్టర్స్ ఈక్వల్ గా ఉండాలని.. సమానమైన పాటలు ఫైట్స్ ఉండాలన్న మాటలు ఈ దర్శకుడి చెవిన పడ్డాయట. ఇలాంటి లెక్కల వల్లే ఈ క్రేజీ కాంబినేషన్ స్క్రీన్ మీదకు వెళ్లకుండా అడ్డుపడ్డాయని కొరటాల చెబుతున్నాడు. 

 

జనతా గ్యారేజ్ సినిమాలో కొరటాల శివ, మోహన్ లాల్ పాత్ర కోసం మొదట బాలయ్యనే అనుకున్నాడట. ఈ పాత్రలో హీరోయిజం అంటే క్యారెక్టర్ ఇంటెన్సిటీ ముఖ్యం. కానీ ప్రాక్టికల్ గా ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోరని నిర్మాతలు కొరటాలకు చెప్పారట. దీంతో ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ను తీసుకున్నాడట. కొరటాల శివ చెప్పింది నిజమే.. కొందరి ఫ్యాన్స్ వల్లే కొన్ని కాంబినేషన్స్ తెరమీదకు రావడం లేదు. మొత్తానికి నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎందుకు రాలేదనే వార్తకు అసలు కారణం తెలిసిపోయింది. అందుకే దర్శకుడు డైలమాలో ఉండటం వల్లే ముందడుగు వేయనట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: