సమయం మనది కాదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండి మనపని మనం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఆవేశంలో నోరు జారామంటే అటు చేసే పని చెడదొబ్బుద్ది, విలువ దిగజారుతుంది. అందుకే తక్కువ మాట్లాడు అది కూడా అవసరం ఉన్నంత వరకే మాట్లాడు, ఎక్కువ పనిచేయు అనే సూత్రాన్ని పాటించమని చెబుతారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కలహాలు, అలకలు కామనే. కాని అవి కూడా శృతి మించకుండా చూసుకుంటే చాలా ఉత్తమం అని తెలుకున్న వారు సమస్యను పెంచుకోరు.

 

 

ఇక కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అయితే సాద్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలా ఉండటం వారి భవిష్యత్తుకే మంచిది. ఇక కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల దర్శకుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది.

 

 

అదేమంటే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌ వర్కింగ్ స్టైల్ కు, ఈ చిత్రానికి  కెమెరామెన్ గా పనిచేస్తోన్న డూడ్లీ వర్కింగ్ స్టైల్ కి పొసగలేదట. కొన్ని షాట్స్ మేకింగ్ లో ఇద్దరికీ మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయట. దాంతో డూడ్లీ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు సమాచారం..

 

 

ఇకపోతే డూడ్లీ  బాలీవుడ్‌లో ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, సింగం’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటో గ్రాఫ‌ర్‌ గా ప‌నిచేశారు. అలాంటి టాలెంటెడ్ కెమెరామెన్ తో చక్కగా వర్క్ చేయించుకోవాలే గాని ఇలా గొడవలు పడితే చేసే ప్రాజెక్ట్ చిక్కుల్లో పడుతుంది, అందులో, ఎలాగూ సంతోష్ శ్రీనివాస్ హిట్ ట్రాక్ లో లేడు.

 

 

ఇక  ఈ   గొడవలు అవసరమా. అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుందట. ఇకపోతే ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తుండగా, దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: