సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు సినిమాల పండుగ కూడా. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ప్రతి హీరో సంక్రాంతి బరిలో ఉండేందుకు వీలుగా సినిమాను సిద్దం చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి విజేతగా నిలబడేందుకు మంచి కథతో సిద్ధం అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన చిత్రాలను చూస్తే... ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన కథ, కథనంతో సంక్రాంతి బరిలో నిలిచాయి. ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నాయి. 


సంక్రాంతి కి విడుదలయ్యే సినిమాలపై ప్రేక్షకులు కూడా చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డును నెలకొల్పాయి. రజనీకాంత్ నటించి డబ్బింగ్ చిత్రం 'దర్భార్' తో పాటు ఈ సంక్రాంతికి మరో మూడు స్ట్రెయిట్ చిత్రాలు కూడా వచ్చాయి. ఈ నాలుగు చిత్రాలు గట్టిగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు 8 కోట్ల షేర్ రాగా, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు వారం రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.


 అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాకు ఆరు రోజుల్లో 70 కోట్లకుపైగా వసూలు సాధించింది. ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురాసినిమా 4  కోట్లు వాసూల్ చేసింది. మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 120 కోట్ల షేర్ దాటింది అంటే రెండు వందల కోట్లు పైమాటే .మొత్తానికి ఈ సంక్రాంతి సినీ పరిశ్రమకు, సినీ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: