పూరి జగన్నాధ్ వచ్చిన తర్వాత మన టాలీవుడ్ హీరోల లుక్ లో కంప్లీట్ తేడా ఒచ్చేసింది. ఒక సినిమాలో కనిపించినట్టు ఇంకో సినిమాలో కనిపించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. క్లాసీగా కనిపించి క్లాస్ హీరోగా ప్రేక్షకులతో అనిపించుకున్న హీరోలు కూడా పూరి సినిమాలతో తన లోని మాస్ యాంగిల్ ని చూపిస్తున్నారు. ఇక రొటీన్ గా కనిపించి ప్రేక్షకులకు బోర్ కట్టించదలచుకోవడం లేదు. ప్రేక్షకులు కూడా తమ ఫేవరేట్ హీరోలను చూసిన విధంగానే ప్రతిసారీ చూడాటానికి థియోటర్స్ వరకు రావడం లేదు.

 

ఇక బాహుబలి, సాహో సినిమాల తర్వాత తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకుంటున్నారు యావత్ భారతదేశంలోని ప్రేక్షకులు. అందుకు తగ్గట్టు హీరోలు మారకపోతే తమ ఛాయిస్ మారిపోతోంది. అంతేకాదు ఫాలోయింగ్ కూడా తగ్గిపోతోంది. మొన్నటిదాకా ఒక హీరోకి ఫ్యాన్స్ గా ఉన్నవాళ్ళు వెంటనే తమ ఫేవరేట్ హీరో ఈయనే అంటూ ఫాలోయింగ్ ని బట్టి మారిపోతున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళను క్లాసీగా తారక్, బన్నీ, రామ్, వరుణ్ లాంటి యంగ్ స్టర్స్ ని మాసీగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

అయితే ఈ విషయం రామ్ బాగా లేట్ గా అర్థమైంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో తనలో ఎంత ఎనర్జీ ఉన్నా దానిని ఇన్నాళ్లు వేస్ట్ చేసుకున్నాడన్న కామెంట్స్ వచ్చాయి. అన్నిటికీ చెక్ పెడుతూ ఇకపై తనని తాను కొత్తగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు రామ్. ఫ్లాపుల్లో రామ్ పూరితో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కొట్టడం తనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇదే ఉత్సాహంలో రెట్టించిన ఎనర్జీతో కొత్తగా ప్రయత్నిస్తున్నాడు.

 

ది రాయల్స్ 2020 మ్యాగజైన్ మే మంథ్ కవర్ పేజీపై రామ్ లుక్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ సంథింగ్ స్పెషల్ గా.. అంతకుమించి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రామ్ కాదు రాయల్ కింగ్ అని అతడి గెటప్ చూడగానే ఫ్యాన్స్ పిలిచేలా గెటప్ ఉండటం ఆసక్తికరం. అంతగా మేకోవర్ లో కొత్తదనం కనిపిస్తోంది. ఈ లుక్ రామ్ కి 100 కి 100 శాతం యాప్ట్ గా ఉందన్న పొగడ్తలు వినిపిస్తున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియంలో కింగ్ విగ్రహానికి ప్రాణం లేచొచ్చిందా! అన్నట్టుగా ఈ గెటప్ చూస్తుంటే అనిపిస్తోంది. రాజాధిరాజ కాస్ట్యూమ్.. సీరియస్ లుక్.. చేత కరవాలం.. అసలు ఆ గెటప్పే వావ్ రామ్ లుకింగ్ సంథింగ్ స్పెషల్ అని పొగిడాల్సిందే. ఇక రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ కి మించి ఎనర్జీతో కనిపించబోతున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: