‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే విజయం సాధించడంతో రాజమౌళి పేరు దేశం లో మరియు ప్రపంచ స్థాయి లో మారుమ్రోగిపోయింది. ఇటువంటి పరిస్థితులలో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటిసారి కలిసి ‘ఆర్ ఆర్ ఆర్’ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇంటర్నేషనల్ స్థాయిలోనే రాజమౌళికి అద్భుతమైన మార్కెట్ ఏర్పడటంతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా హక్కుల కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

విషయంలోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు నందమూరి కుటుంబం అంటే ఎంతగానో ప్రేమించే నాయకుడు హరికృష్ణ కి శిష్యుడిగా పేరు తెచ్చుకున్న గుడివాడ ఎమ్మెల్యే వైసిపి పార్టీ మంత్రి కొడాలి నాని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కృష్ణాజిల్లా హక్కులకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ మరియు అదుర్స్ సినిమాల కృష్ణాజిల్లా హక్కులు అందుకోవడం జరిగింది. 

 

అయితే తాజాగా వచ్చే జూలై నెలాఖరులో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కృష్ణాజిల్లా సినిమా రైట్స్ అందుకుని వైసిపి ప్రభుత్వపరంగా సినిమాకి సహకరించడానికి అన్ని విధాల కొడాలి నాని రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో మరియు రాజకీయ రంగంలో వినబడుతున్న టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగానే పూర్తయినట్లు కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో ఎక్కువగా ఎన్టీఆర్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే తెరకెక్కించిన సన్నివేశాలు చిత్రీకరించే పనిలో రాజమౌళి ఉన్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: