టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. అయితే ఫస్ట్ సినిమా ఆమె ఆశించిన రేంజ్ లో హిట్ ని అందించలేకపోయిందనే చెప్పాలి. ఆ తరువాత రెండేళ్లకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా అనూహ్య విజయంతో తమన్నా పేరు మారుమ్రోగింది. ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన తమన్నాకు ఆపై టాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ సరసన మంచి అవకాశాలు దక్కాయి. 

 

అయితే తమన్నా ఎక్కువగా టాప్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఇటీవల మాత్రం ఆమె మంచి విజయాలు అందుకుంటోంది. ఇకపోతే కొద్దరిరోజుల క్రితం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన తమన్నాకు మరింత పేరు దక్కింది. ఇక మధ్యలో అక్కడక్కడా ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇక ప్రస్తుతం గోపీచంద్ సరసన ఒక సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దట్ ఈజ్ మహాలక్ష్మి అనే సినిమా, అలానే బాలీవుడ్ లో బోలె చుడియా అనే సినిమాలో కూడా నటిస్తోంది. 

 

ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫాషన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ పలు రకాల ఫోటో షూట్స్ లో పాల్గొనే తమన్నా, నేడు నెమలిపించం రంగు చీరలో, అందమైన నెమలిలా అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేసింది. ఇక ఆ ఫొటోల్లో ఆమెను చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్, దివి నుండి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి వలె ఉన్నావు అంటూ ఆమె అందంపై పొగడ్తలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: