అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. చలో  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తాజాగా సూపర్ స్టార్  మహేష్ బాబు  సరసన ఛాన్స్ కొట్టేసింది.  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు పెరిగాయి. ఎక్కడ అందాల ఆరబోత చేయకుండానే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇకపోతే తాజాగా రష్మిక మందన్న కు ఐటీ  శాఖ నుంచి నోటీసులు అందినట్లు  సమాచారం. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజపేట లోని నివాసంలో గురువారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 

 

 

ఇంటితోపాటు రష్మిక కుటుంబ సభ్యులకు ఉన్న  కల్యాణమండపంలో సోదాలు జరిపిన ఐటీ శాఖ అధికారులు... 25 లక్షల రూపాయల నగదుతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఈ నగదు కు సంబంధించి సరైన పత్రాలు రష్మిక  తల్లిదండ్రులు చూపలేదు. దీంతో ఈ నెల 21న బెంగుళూరు మైసూర్ కార్యాలయంలో హాజరై వీటి వివరాలు అందించాలని అంటూ రష్మిక కు నోటీసులు జారీ చేశారు ఐటీ శాఖ అధికారులు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో రష్మిక తండ్రి ఆఫీసులపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు

 

 

 

 అయితే రష్మిక ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు దాడి చేసిన సమయంలో రష్మిక చెన్నైలోని ఓ తమిళ మూవీ షూటింగ్లో పాల్గొన్నది. అయితే మొదట రష్మిక ఐటీ దాడుల గురించి తీసుకుని మామూలుగానే పరిగణించింది. తన తండ్రికి సంబంధించిన వ్యాపార సంస్థలపై ఐటి దాడులు గా భావించింది  కానీ అదే సమయంలో రష్మిక  పేరుతో ఉన్న పలు అంశాలకు సంబంధించిన పత్రాలను కూడా ఐటీ  శాఖాధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే ఎలాంటి లెక్కలు  లేని కారణంగా బెంగళూరు మైసూరు కార్యాలయాలకు  హాజరై వివరాలు అందించాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు. సరియైన లెక్కలు చెప్పలేని పక్షంలో రశ్మికపై  అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కన్నడ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కావాలనే రష్మిను క ఇరికించారు అంటూ పుకార్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: