ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త హీరోలు వచ్చారు. ఒకప్పుడు నాగార్జున చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ తప్పితే.. హీరోలు ఎక్కువగా కనిపించే వారు కాదు. ఏ సినిమా తీయాలని దర్శకులు అందరికీ ఈ నలుగురే  కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. చిన్న హీరోలు అప్పుడు ఇప్పుడు ఏదో ఒక సినిమా చేస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు ఏకంగా మెగా ఫ్యామిలీ అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక ఇతర ఫ్యామిలీల  నుంచి కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఎక్కడ సినిమాల కొరత ఉండటం లేదు. ఒక హీరో సినిమా కాకపోతే మరో హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 

 


 బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక హీరో సినిమా ప్రతి వారం విడుదల అవుతోంది. అభిమానులకు ఫుల్ టైం ఎంటర్టెన్మెంట్ దొరుకుతుంది. పండుగలప్పుడు అయితే ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో సినీ ప్రేక్షకులకు పండుగలప్పుడు ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... రోజురోజుకు  అభిమానులందరూ తెలుగు సినిమాల మీద హీరోల మీద విసిగిపోతున్నట్లు  మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే దర్శక నిర్మాతలందరూ సినిమా ఎలా వసూళ్లు సాధిస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప... ప్రేక్షకుల్లోకి  ఎంత చేరుతుంది అనేది మాత్రం పట్టించుకోవడం లేదని అభిమానులు భావిస్తున్నారు. 

 


 వసూళ్లు వసూళ్లు అంటూ మొత్తం దర్శకనిర్మాతలు వస్తువుల మీద పడి పోతు... వివిధ రకాల ఒక సినిమాకు మరింత హైప్ తీసుకొస్తున్నారు. కమర్షియల్ హంగులతో నే నాలుగు ఫైట్లు 4 కామెడీ సీన్లు... నాలుగు పాటలతో  సినిమా కానిచ్చేస్తున్నార. అయితే బాగా తెరకెక్కించిన  సినిమాల పై ప్రేక్షకుల్లో మరింత హైప్ తీసుకొస్తే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక సినిమా బోల్తా పడుతుందని అంటున్నారు. ఇక సినిమాల నుండి కమర్షియల్ హంగులు అద్ది అనవసరమైన హైప్  తీసుకువస్తున్నారని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సినిమా భారీ వసూళ్లు రాబట్టాలని అనవసరమైన హైప్  తీసుకొస్తే మొదటికే మోసం వస్తుందని అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: