బాహుబలి తర్వాత రాజమౌళిని బీట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని ట్రేడ్ పండిట్స్ చాలా సార్లు చెప్పారు. ఇప్పట్లో జక్కన్నని క్రాస్ చేయలేరని స్టేట్ మెంట్స్ ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఓ ఏరియాలో రాజమౌళిని దాటేశాడు. 

 

త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో.. ఎమోషనల్ సీన్స్ కూడా అంత బలంగా ఉంటాయి. పంచ్ లు యూత్ కు కనెక్ట్ అయితే.. ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కేస్తుంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాలు అనగానే మాస్ థియేటర్లని బీట్ చేయాలని ట్రై చేస్తుంటాయి మల్టీప్లెక్సులు. ఈ పోటీతోనే ఓవర్సీస్ లో సూపర్ డైరెక్టర్ గా నిలిచాడు త్రివిక్రమ్. 


త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి హిట్ అల వైకుంఠపురమలో సినిమా అమెరికాలో అదరగొడుతోంది. చలితో పోటీ పడుతూ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఆరు రోజుల్లోనే ఈ మూవీ రెండు మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో ఈ ఫిగర్ మరింత పెరుగుతుందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. 

 

త్రివిక్రమ్ ఇప్పటికే మూడుసార్లు ఓవర్సీస్ లో రెండు మిలియన్లకు పైగా వసూల్ చేశాడు. అఆ.. అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో మూవీతో డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అయ్యాడు. ఇక ఈ రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో రాజమౌళిని కూడా దాటేసి ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్.. రాజమౌళిని దాటేశాడు. ఇపుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అంతా లక్కే వెంటాడుతోంది. అరుదైన స్టోరీలతో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టిస్తూ తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండిస్తూ సినీ జనాల ఆదరణను పొందుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇపుడు డైరెక్టర్లలో ఓ డైమండ్ లా మారిపోయాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: