ఏదైనా సినిమాకు సైన్ చేస్తే కెరీర్ ప్లస్ అవ్వాలి. అంతేగానీ కెరీర్ ని ముంచెయ్యకూడదు. ఇపుడు ఇండియన్ 2 సినిమా కూడా ఇలాగే కాజల్ ను దెబ్బకొడుతోంది. శంకర్ సినిమా అని భారీ ఆశలతో కాల్షీట్స్ ఇస్తే.. కెరీర్ ప్రమాదంలో పడుతోంది. ఇంతకీ ఈ మూవీతో కాల్ కు వస్తున్న సమస్యలేంటో తెలుసా..?


కాజల్ అగర్వాల్ సరైన సక్సెస్ ను చూసి రెండేళ్లు దాటుతోంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత కాజల్ కు అన్నీ ఫ్లాపులే పడ్డాయి. ఈ టైమ్ లో పూజా హెగ్డే, రష్మిక మందన లాంటి యంగ్ బ్యూటీస్ వరుస హిట్స్ తో దూసుకెళ్లిపోయారు. దీంతో కాజల్ కెరీర్ కు బ్రేకులు పడ్డాయి. సరైన సక్సెస్ లేకపోతే ఫేడవుట్ లో కలిసిపోవడం ఖాయమనే టాక్ స్టార్ అయింది. 


కాజల్ కెరీర్ క్లైమాక్స్ కు చేరుతోన్న టైమ్ లో ఇండియన్ 2కి సైన్ చేసింది కాజల్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో ఇండియన్ కు సీక్వెల్ గా వస్తోంది సినిమా. ఈ మూవీలో కాజల్ 85ఏళ్ల బామ్మగా కనిపించబోతోంది. ఒరిజినల్ లో సుకన్య పోషించిన బామ్మ పాత్రని ఇప్పుడు కాజల్ పోషిస్తోంది. 


ఇండియన్ లో బామ్మ పాత్ర సుకన్య చేసిందని చెబితేగానీ జనాలకు తెలియలేదు. అలాంటిది ఇపుడు కాజల్ బామ్మగా నటిస్తే ఆడియన్స్ గుర్తుపట్టగలరా.. అసలు గ్లామర్ క్వీన్ గా హంగామా చేసినప్పుడే జనాలు పట్టించుకోవడం లేదు. ఇక బామ్మగా నటించి మెప్పించగలదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొంత మందైతే ఇండియన్ 2కి సైన్ చేసి కాజల్ సెల్ఫ్ గోల్ చేసుకుందని.. ఈ సినిమాతో కెరీర్ కు నష్టం తప్ప లాభం ఉండదని కామెంట్ చేస్తున్నారు. మరి ముసలమ్మ పాత్రతో కాజల్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: