బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు.. ఢీ .. పోవే పోరా.. క్యాష్.. ఇలా అన్ని షోలలో సుడిగాలి సుధీర్ హవా నడుస్తోందిప్పుడు. మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ షోలు ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీని అందిస్తున్నాయి. బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఇక‌ స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు.

 

జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్.. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా మారారు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ చిత్రం సుధీర్ అభిమానులను కూడా నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే.. సుడిగాలి సుధీర్ అంటేనే శృంగార వీర అనే పాట బ్యాక్ గ్రౌండ్లో వేస్తుంటారు. అలాంటి సుధీర్ ఎలాంటి యాంకర్ ఉన్న తన గ్రిప్ లోకి తెచ్చుకొని కెమిస్ట్రీ పండిస్తాడని పేరుంది. అయితే తాజాగా పోవేపోరా ప్రోమోలో సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ వీర‌లెవ‌ల్‌లో రొమాన్స్ చేశాడు. 

 

ఈ  ప్రోగ్రాంలో సుడిగాలిసుధీర్, విష్ణుప్రియ జోడీ సరసాలు చాలు శ్రీవారు అంటూ రెచ్చిపోయారు. అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించారు. ఇద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంత‌టితో ఆగ‌ని సుధీర్ కాస్త ఎక్కువగా కెమిస్ట్రీ పండిస్తుండటంతో అటు రష్మీ అభిమానులు మాత్రం నెట్టింట కాస్త గుర్రుగా ఉన్నారు. కాగా, సుడిగాలిసుధీర్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తమ షోలో కొత్త కొత్త డ్యూయెట్స్ తో అలరిస్తుంటారు. అయితే ఆ సారి కాస్త ఎక్కువ‌గానే చూపించారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఫులు ఖుషీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: