స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా త్రివిక్రం దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అల వైకుంఠపురములో'. జనవరి 12 న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు మంచి వసూళ్ళని రాబడుతోంది. ఇందులో భాగంగా సినిమాని చిత్ర బృందం ఇంకా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఇక అల సక్సస్ లో భాగంగా ఈ సోమవారం అల చిత్ర యూనిట్ వైజాగ్ లో సక్సస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో బన్నీ స్పీచ్ అదిరిపోయి అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఇండస్ట్రీ రికార్డు విషయంలో బన్నీ చేసిన కామెంట్స్ మాత్రం విమర్శలకు అవకాశమిచ్చాయి. బన్నీ తన స్పీచ్ లో "నాన్నగారి బ్యానర్లో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. చిరంజీవి గారితో.. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.. మగధీర తో చరణ్ గారితో ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. 

 

అలాగే హిందీలో అమీర్ ఖాన్ గారితో కూడా ఇండస్ట్రీ రికార్డు కొట్టారు. అలా అందరితో ఇండస్ట్రీ రికార్డు కొట్టిన మా నాన్నగారి బ్యానర్ లో నాకు సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు పడ్డాయి తప్ప ఇండస్ట్రీ రికార్డు సినిమా లేదనుకునేవాడిని. ఎప్పటికైనా గీతా ఆర్ట్స్ లో ఒక్కటయినా నా సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టాలని అనుకునే వాడిని. త్రివిక్రమ్ గారి వల్ల నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీ రికార్డు కొడుతున్నారు. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ." అన్నారు. అయితే ఇక్కడే తేడా కొట్టింది. కొడుతున్నాను అన్న మాట చాలామందికి కామెడిగాను..ఇంకా కొట్టలేదుగా అన్న సెటైర్ వేయడానికి ఛాన్ గాను ఉపయోగపడుతోంది. 

 

దీంతో బన్నీ ఇండస్ట్రీ రికార్డు స్పీచ్ పై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. ఇండస్ట్రీ రికార్డుకు మీనింగ్.. ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డును సృష్టించడం. అందుకు ఉదాహరణ మహేష్ బాబు పోకిరి'..చరణ్ 'మగధీర'..పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లాంటి సినిమలనమాట్. ఈ సినిమాలన్నీ అప్పటికి ఉన్న రికార్డులను వాష్ ఔట్ చేసి మరీ కొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఆ తర్వాత వచ్చిన రాజమౌళి 'బాహుబలి'. 'బాహుబలి 2' ఇండస్ట్రీ రికార్డ్స్ అంటే ఏంటో చూపించాయి. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏ సినిమా అయినా ఇండస్ట్రీ రికార్డు సాధించాలంటే 'బాహుబలి-2' రికార్డులను తుడిచేయాలి. నాన్ బాహుబలి.. నాన్ బాహుబలి-2 రికార్డులు అన్నవి మెగాస్టార్ సైరా, ప్రభాస్ సాహో వల్లే కాలేదు అన్న పాయింట్ మీదే బన్నీ పై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పడుతున్నాయి.

 

'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అన్న విషయంలో అసలు అనుమానం లేదు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ప్రకారం బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పొచ్చు. ఇండస్ట్రీ రికార్డు కొట్టాలంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో ఎక్సెప్షన్స్ లేకుండా నెంబర్ స్థానంలో నిలబడాలి. సంక్రాంతి పోటీ జోరుగా ఉంది కాబట్టి ఫ్లోలో బన్నీ 'ఇండస్ట్రీ రికార్డు' అంటే అర్థం ఏంటో కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడి ఉంటే బావుండేదని సున్నితంగా సెటైర్స్ వేస్తున్నారు. అంతేకాదు అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అడిగితే చెప్పను బ్రదర్ అన్న బన్ని డైలాగ్ ని ఆయనకే చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: