సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. పైరసి, ఒక సినిమా విడుదల కాకముందే అది బయటకు రావడం, లేదా విడుదల అయిన ఫస్ట్ రోజే దాని డూబ్లికేట్ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడం, నిర్మాతలతో పాటుగా, చిత్ర బృందానికి చాలా నష్టం కలిగిస్తుంది. ఎంతగానో కష్టనష్టాలను ఓర్చుకుని, చిత్ర నిర్మాణం పూర్తిచేసుకుని బయటకు వచ్చిన కొన్ని సినిమాలకు ఈ లీకుల వల్ల తీరని నష్టం జరుగుతుంది. వీటి బారిన చిన్న సినిమాలే కాదు, పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలు కూడా పడి నష్టాలు మూట గట్టుకుంటున్నాయి..

 

 

ఇదే కాకుండా సినిమా షూటింగ్ సంబంధిన విషయాలు బయటకు పొక్కడం ఇప్పుడొక తలనొప్పిగా తయారైందట. అయితే షూటింగ్‌కు సంబంధిచిన విషయాల వరకు ఓకే గాని సినిమాలే ఇలా ఫ్రీగా ప్రత్యక్షమైతే ఎలా అని ఇప్పటి వరకు ఆలోచించడమే తప్పితే ఈ విషయంలో ఎలాంటి పక్కాగా జరిగే రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇకపోతే ఇప్పుడు ఇలాంటి లీకులతో విక్టరీ వెంకటేష్ సతమతం అవుతున్నారట. అదేమంటే తాజాగా అసురన్ సినిమాకు రీమేక్ గా చిత్రాన్ని నిర్మించబోతున్నారన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ఫిక్స్ అయిన సంగతి ముందే బయటకు వచ్చేసింది.

 

 

ఇక ఈ చిత్రంలో వెంకీ గెటప్ ఎలా వుండబోతోంది అన్న క్యూరియాసిటీ వెంకీ ఫ్యాన్స్ కు వుంది. ఇందుకు గాను ఈ లుక్‌ను షూటింగ్ ప్రారంభమయ్యే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అప్పుడే టైటిల్ కూడా అనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ దానికి రెండు రోజులు ముందుగానే నారప్ప అనే టైటిల్ బయటకు వచ్చేసింది. వ్యవహారం అక్కడితో ఆగలేదు. ప్రస్తుతం వెంకీ గెటప్ లు అన్నీ ఇప్పుడు వాట్సప్ ల్లో, ట్విట్టర్ ల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుబురు గెడ్డం, మెలికలు తిరిగిన మీసం, తలకు తలపాగా, ముఖంపై గాట్లు, పైగా అడ్డ బొట్టు ఇలా రఫ్ ప్లస్ ఏజ్డ్ లుక్ తో వెంకీ కనిపిస్తున్నాడు. ఇంత వరకు ఫర్వాలేదు గాని ఈ సినిమాకు ఉన్న లీకుల బెడద వల్ల సినిమా మొత్తం బటకు వస్తే పరిస్దితి ఏంటనేది, తలచుకుంటే చిత్రబృందానికి నిదుర రావడం లేదట..

మరింత సమాచారం తెలుసుకోండి: