అటు హీరోగా సినిమాలు చేస్తూ.. ఒక్కోసారి పాత్రలని బట్టి కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో కూడా నటిస్తుంటారు. అయితే ఆ పాత్రలకి ఎంతో కొంత ప్రాధాన్యం ఉంటుంది. అలా ప్రాధాన్యమున్న పాత్రల్లో చేయడం వల్ల ఆ హీరోల ఇమేజ్ పెరిగే అవకాశమే ఎక్కువ. అందుకని హీరోగా సినిమాలు చేస్తూనే ఒక్కోసారి విలన్ గానూ నటిస్తుంటారు. తమలోని నటుడిని సంతృప్తి పర్చుకోవడం కోసం ఇలా సినిమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

 

తాజాగా హీరో సుశాంత్ అల వైకుంఠపురములో సినిమాలో అలాంటి పాత్రే చేశాడు. హీరోగా రెండు సంవత్సరాలకోసారి ఒక సినిమా చేస్తూ మెల్లిగా తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్న సుశాంత్ 
"చిలసౌ" సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే తన లుక్ హీరోగా కలిసి రాదనుకున్నాడో ఏమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకనే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు.

 

అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాలో సుశాంత్ కి పాత్ర అంటే బాగానే ఉంటుందని అనుకున్నారు. అయితే పాత్ర పరిధి మేరకు సినిమాలో సుశాంత్ నటన బాగానే ఉన్నప్పటికీ... ఆ సినిమాలో పెద్ద ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల సుశాంత్ కి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమాలో నటిస్తే తనకి ప్లస్ అవుతుందని భావించిన సుశాంత్ కి నిరాశే ఎదురయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో అతను అస్సలు మాట్లాడలేకపోవడం కూడా మైనస్ గా మారింది.

 

మహర్షి చిత్రంతో అల్లరి నరేష్‌ బాగా బిజీ అయిపోతానని అనుకున్నాడు. నిజంగానే అందులో అతనికి చాలా ప్రాధాన్యత వున్న పాత్ర దక్కినా కానీ నరేష్‌కి పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇక సుషాంత్‌ ఇలాంటి పాత్ర చేయడం వల్ల అతనికి వచ్చే అడ్వాంటేజ్‌ ఏముండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: