ఈ కాలంలో సినిమా తీయాలంటే విలువలు అవసరం లేదు. దాన్ని ఏ విధంగా అయినా తెరకెక్కించవచ్చు. దానిలో కంటెంట్ లేకున్నా, ఆ కధను సాహతీసి, నాలుగు రోమాన్స్ సీన్స్ కలిపిస్తే సినిమా అవుతుందనే భావనతో ఎన్నో సినిమాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. ఇక సినిమాకు ఒకప్పుడు కధ బలం. ఆ కధతో పాటుగా అందులో నటించే నటీనటులు కూడా బలమే. కాని ఇప్పుడు నటీనటులతో గాని, వారి  బాషతో సంబంధం లేదు.

 

 

ఈ మద్యకాలంలో వస్తున్న చాలా సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ప్రయోగాల విషయానికి వస్తే, సినీ దర్శకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. అందులో కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని నష్టాలను మిగుల్చుతున్నాయి.  ఇకపోతే ఇప్పుడొక డిఫరెంట్ కధలు అని చెప్పి మోడరన్ ముసుగులో అడ్డమైన సినిమాలు తీసి జనాల మీదికి వదులుతున్నారు కొందరు. తాజగా ఇప్పుడు హిందీలో కూడా అలాంటి ఓ కొత్త సారీ .. ఓ చెత్త ప్రయత్నం జరుగుతుందట..

 

 

అదేమంటే హితేష్ కైవల్య దర్శకత్వంలో శుభ మంగళ్ జ్యాదా సావధాన అనే టైటిల్ తో, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ కథాంశంతో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే, ఇద్దరు యువకుల మధ్య సాగే అంటే ఇద్దరు 'గే' ల మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అర్థం అవుతుంది..

 

 

అంతే కాకుండా వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. వీటితో పాటుగా చాలా దారుణాలు అంటే ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేయడం, ఇద్దరు అబ్బాయిలు లిప్ లాక్ చేసుకోవడం లాంటివి ఈ ట్రైలర్ లో ఉన్నాయి.

 

 

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయడానికి సన్నాహలు జరుగుతుండగా, ఇండియాలో ఉన్న యూత్ లో సగానికి పైగా వింత వింత పోకడలతో, వికృత చేష్టలతో దారుణంగా తయారయ్యారని గగ్గోలు పెడుతుండగా, ఇలాంటి వారిని బాగుచేసే సినిమాలు తీయవలసింది పోయి. ఇలాంటి దారుణమైన ఐడియాలను జనాలమీదికి రుద్ది.. ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నారో ఏమో కొందరు దర్శకులు అని అనుకుంటున్నారట ఈ ట్రైలర్ చూసిన వారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: