మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్వతంత్ర పోరాట యోధుడుగా నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ  పీరియాడికల్ మూవీని యువ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా భాటియా ఒక కీలక పాత్రలో నటించింది. 

 

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివిది సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామ్యాన్ గా పని చేయగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేసారు. అయితే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అత్యద్భుత నటనను కనపరిచినప్పటికీ, దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం సినిమాని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఓవర్ ఆల్ గా మెల్లగా ముందుకు సాగిన ఈ సినిమాని ఇటీవల సంక్రాంతి కానుకగా ఈనెల 15న జెమినీ టివిలో ప్రసారం చేసారు. అయితే ఆరోజున పండుగ కావడంతో మంచి రేటింగ్స్ వస్తాయని సదరు ఛానల్ వారు భావించారని, 

 

అయితే కేవలం 11.8 రేటింగ్స్ మాత్రమే సినిమాకు దక్కడంతో చానల్ వారు కొంత షాక్ కు గురయ్యారని సమాచారం. అయితే ఇటీవల ఈ సినిమాని తమిళ టివిలో ప్రసారం చేయగా అక్కడ ఏకంగా 15.4 రేటింగ్స్ ని దక్కించుకుంది. ఇది ఒకరకంగా అక్కడ బడా హీరోల సినిమాలకు వచ్చే రేటింగ్ అని, దీనిని బట్టి మెగాస్టార్ కు తమిళనాట ఎంత పేరు ఉందొ అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు షాక్ ఇవ్వటానికి కారణం, ఇక్కడి వారు ఎక్కువమంది సినిమాని థియేటర్స్, అలానే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చూసేయడమేనని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: