కోలీవుడ్ టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు సిద్దార్థ.  హీరోగా సిద్దార్థ దాదాపు పదేళ్ల పాటు వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలులు చేస్తూ వచ్చాడు. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాగే బాలీవుడ్ లో రంగ్ దే బసంతి కూడా సిద్దార్థ కి మంచి క్రేజ్ తీసుకు వచ్చింది. అయితే ఉన్న పలంగా సిద్దార్థ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. వరుసగా ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. దాంతో సినిమాలు బాగా తగ్గిపోయాయి. అయితే ఇప్పటికి కూడా హీరోగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కాని సక్సెస్ మాత్రం అవడం లేదు. దాంతో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిద్దార్థ బాగా స్పీడ్ మీదున్నాడు.

 

శంకర్ దర్శకత్వంలో యూనివర్శిల్ స్టార్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలో కీలక పాత్రను సిద్దార్థ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాతో సిద్దార్థ్ మళ్ళీ బిజీ అవబోతున్నాడట. అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా సిద్దార్థ నటించబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా సమాచారం.

 

శివ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమాలో ముఖ్య పాత్రను సిద్దార్థ తో చేయించాలని మేకర్స్ నిర్ణయించారట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను ఈనెల చివరి వారంలో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారట.
రజినీకాంత్, కమల్ హాసన్ ల సినిమాల్లో ఒకేసారి ఛాన్స్ దక్కించుకున్న సిద్దార్థ ఇక వరుసగా సినిమాలు కమిటవుతాడని కోలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సిద్దార్థ ఇక హీరోగా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: