అక్కినేని నాగార్జున కెరీర్ లో కొన్ని సినిమాలు ఎప్పటికీ మరుపురాని విధంగా ఉన్నాయి. మజ్ను,గీతాంజలి,అన్నమయ్య ఇలా ఆయన కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ గా చెప్పొచ్చు.  ఆ తర్వాత అదే స్థాయిలో ఆయన కెరీర్ లో మరో బాక్సాఫీస్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’ .  ఈ మూవీలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించాడు.. ఒక పాత్ర అమాయంగా ఉంటే.. మరోపాత్ర సోగ్గాడిలా కనిపిస్తుంది.  ఈ మూవీలో నాగార్జున.. బంగార్రాజు పాత్రలో దుమ్మురేపాడు.  అయితే ఈ మూవి సూపర్ హిట్ అందుకున్న తర్వాత సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మద్య తెగ వార్తలు వచ్చాయి. అంతే కాదు ఇందులో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

 

కాకపోతే ఇది సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందన్న విషయం పై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. గత ఏడాది నాగార్జున నటించిన ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు2 అపజయాలు అయ్యాయి. ఇకదశలో మన్మథుడు 2 నాగ్ మార్కెట్ ని గట్టి దెబ్బ కొట్టింది. దీంతో నెక్స్ట్ సినిమాతో పోయిన మార్కెట్ ని ట్రాక్ లోకి తెచ్చుకోవాలని నాగ్ మంచి కాన్సెప్ట్ తో రావాలని గట్టి పట్టుమీదే ఉన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత ఏడాది నుంచి బంగార్రాజు కథ పట్టుకొని నాగ్ చుట్టూ తిరుగుతున్నాడు. నాగార్జున సలహాల మేరకు సినిమా స్క్రీన్ ప్లే ను మార్చిన దర్శకుడు ఫైనల్ గా మెప్పించినట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి ఈ మూవీ సమ్మర్ లో ప్లాన్ చేయాలనుకున్నారు. కానీ సంక్రాతి సెంటిమెంట్ అంటే నాగ్ కి చాలా ఇష్టం. అందుకే సమ్మర్ లో సినిమాను మొదలుపెట్టి 2020 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  సోగ్గాడే చిన్ని నాయన 2016 సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకున్నారు. ఒకవేళ అంతా ఓకే అయి సంక్రాంతికే రిలీజ్ అయితే ఆ సెంటిమెంట్ కలిసివస్తుందో రాదో చూడాలి. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ ప్రకటన రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: