మాస్ మహారాజ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డిస్కోరాజా.. నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. ఈ నెల ౨౪ న విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రవితేజ అభిమానులకి ఓకే అనిపించినప్పటికీ, సగటు ప్రేక్షకుడు ఒకింత నిరాశకి గురయ్యేలా ఉందని అంటున్నారు.

 

 

అయితే ఈ సినిమాకి విడుదల ముందు మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంతకుముందు రవితేజ సినిమాలకి కొరవడిన బజ్ ఈ సినిమా ద్వారా ఏర్పడడంతో చిత్ర బృందం ఈ సినిమా మీద మంచి ఆశలు పెట్టుకుంది. అయితే మాస్ మహారాజ రవితేజ తనదైన శైలిలో మాస్ ప్రేక్షకులని అలరించినప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడం సినిమాకి మైనస్ అయిందని చెప్పాలి. కథ కొత్తదే. కానీ అదొక్కటే సరిపోలేదు.

 

 

35 ఏళ్ల ముందు చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోసి మళ్లీ ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే అతడికి ఎదురైన అనుభవాలేంటి అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలై ఏదో ఉంది అని అనుకునే సమయానికి సాధారణ రవితేజ సినిమా చూసే స్థాయికి వచ్చేసింది. సినిమా ఆరంభించడం అద్భుతంగా ఉన్నప్పటికీ... అదే ఆసక్తితో చివరి వరకు కూర్చొనేలా చేయలేకపోయాడు. దర్శకుడు తాను అనుకున్న  పాయింట్‌కు కట్టుబడి కథను నడిపించడం.. చుట్టూ బిగువైన కథనాన్ని అల్లడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు.

 


కథ ఎలా నడుస్తుందో అదే దారిలో నడవక మధ్యలో సందర్భంలేని పాటలతో, రొమాన్స్ తో, కామెడీ అని చెప్పి సినిమాని ఒక సాధారణ సినిమాలాగా చేసేశాడు. మొత్తానికి ఈ సినిమా పాయింట్ బాగున్నప్పటికీ, చివరి వరకు అదే పాయింట్ ని పట్టుకోకుండా పక్కదారి పోవడం వల్ల సినిమాకి మైనస్ అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: