బొంగ‌రాలంటి క‌ళ్ళు తిప్పింది. ఉంగ‌రాలున్న జుట్టు తిప్పింది. గింగిరాలెత్తే న‌డుఒంపుల్లో న‌న్నే తిప్పింది. అమ్మో బాపుగారి బొమ్మో... ఓల‌మ్మో మ‌ల్లెపూల కొమ్మో...ర‌బ్బ‌రు గాజుల రంగు తీసింది. బుగ్గ‌న ఎరుపున రంగు తీసింది...అంటూ పాట వింటుంటే ఎవ‌రు గుర్తుకు వ‌స్తున్నారు. అర్ద‌మ‌యిందా.... య‌స్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ర‌ద‌లండీ... ఎవ‌రా అనుకుంటున్నారా అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించిన ప్ర‌ణీత‌. 

 

 ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా విష‌యం తెలిసిందే. అయినా స‌రే ఎందుకోగాని తెలుగులో ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది, కానీ మెయిన్ హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్ కొట్ట‌లేక‌పోయింది. . అయితే ప్రణీత ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తోంది.

 

హాట్ హాట్ మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేసుకుని.. బికినీల్లో కొంటె చూపులు చూస్తూ కుర్రాళ్ళ‌కు కునుకు లేకుండా చేస్తోంది ఈ భామ‌. అందం అభిన‌యం .. గుడ్రంగా ఉండే పెద్ద పెద్ద క‌లువ‌పువ్వులాంటి క‌ళ్ళు అన్నీ ఉన్నా కూడా ఎందుకో అవ‌కాశాలు మాత్రం ఈ భామ‌ని పెద్ద‌గా వ‌రించ‌డం లేదు. అందుకే కాబోలు ఇలా హాట్ స్టిల్స్ ఇచ్చి ఛాన్స్‌లు కొడ‌దామ‌ని అనుకుంటుందేమో మ‌రి. అవ‌కాశాలు తగ్గుముఖం పట్ట‌డంతో . ఈ క్రమంలో ఈమె సోషల్ మీడియా ద్వారా తను ఉన్నాననే సంకేతాలు అప్పుడ‌ప్పుడూ ఫ్యాన్స్‌కి ఇస్తూ వ‌స్తోంది.  ఇన్ స్టాగ్రమ్ లో గ్లామరస్ ఫొటోలు పోస్టు చేస్తూ ఉంది ఈ హీరోయిన్. గ‌తంలో కూడా ఒక‌సారి ఓ బాత్‌ట‌బ్‌లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఓ స్టిల్‌ని పోస్ట్ చేసింది ఈ భామ‌. ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సినిమాల్లో కూడా రెండో హీరోయిన్‌గా న‌టించింది కానీ, వాటితో కొంత గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ  స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. మ‌రి అవ‌కాశాల కోసం ఈ భామ ప‌డే క‌ష్టాలు చూసి ఎవ‌రైనా క‌రుణిస్తారో లేదో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: