ఏ హీరోయిన్ అయినా సినిమాలతో బిజీగా ఉన్నంత సేపు వేరే వ్యాపకాలేమి ఉండవు. ఇక ఏదో ఒక సీన్ లో గ్లామరస్ గా కనువిందు చేయడం, స్కిన్ షో తో జనాలన్ టెంట్ చేయడం ..అవసరమైతే హీరోలకి లిప్ లాక్స్ ఇవ్వడం కామన్. అంతేకాదు ఇదంతా వృత్తిలో భాగమే అని కూడా చెబుతుంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. ఇక నార్త్ సౌత్ హీరోయిన్స్ అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్లతో పాటు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండడంతో ఎవరి కథ ఎలా ఉంటుందో నెటిజనులే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడెలా ఉంటుందో అర్థం చేసుకుని కామెంట్లతో హాట్ టాపిక్ అవుతున్నారు. 

 

కామన్ ఆడియన్స్ కూడా టిక్ టాక్ ట్రెండ్ కి సోషల్ మీడియా ట్రెండ్ కి అలవాటు పడి హీరోయిన్స్ మైండ్ సెట్ ని చదివేసి అసలేం జరుగుతోందో ..తర్వాత ఏం జరగబోతోందో ఊహించేస్తున్నారు. ఆ కోవలో చూస్తే ఇటీవల గత కొంతకాలంగా అందాల రకుల్ వ్యవహారం ఏదో తేడా కొడుతోందనే సందేహం ప్రేక్షకుల అందరిలోను వ్యక్తమవుతోంది. 2018-19 రకుల్ కి బ్యాడ్ టైం అని చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూపర్ స్టార్ మహేష్ బాఉ హీరోగా నటించిన స్పైడర్..అలాగే అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 లాంటి భారీ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో రకుల్ కెరీర్ కి బాగా డామేజ్ అయింది. అప్పటివరకూ తనకు ఉన్న క్రేజ్ కాస్తా జీరో అయిపోయింది. దాంతో తెలుగులో ప్రస్తుతం రకుల్ కి అవకాశాలే లేకుండా కూర్చుంది.

 

అందుకే పక్క సినీ పరిశ్రమల్లో ప్రయత్నిస్తోంది. ఆల్రెడి హిందీ, తమిళ్ సినిమాలు చేసింది కాబట్టి పాత పరిచాయలతో ఆ రెండు ఇండస్ట్రీస్ లో ఉన్న మేకర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాల్లో రకుల్ వ్యవహారం అంతే వేడెక్కిస్తోంది. ఇంతకుముందు ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ నుంచి బికినీ ఫోటోలతో జనాలని కిర్రెక్కించేసింది. తాజాగా మరోసారి స్విమ్ సూట్ లో కనిపించి కవ్విస్తోంది. ప్రస్తుతం రకుల్ డైరీ ఖాళీగా ఉండటంతో ఇలా బికిని షోస్ చేస్తున్నారా ...అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మేకర్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో ఉంది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: