ప్ర‌స్తుతం హీరోలు తామే సొంత బ్యాన‌ర్లు పెట్టుకుని సినిమాలు తీసుకోవ‌డం ట్రెండీగా మారింది.  దాంతో వాళ్ళ‌కు నిర్మాత‌లు ప‌డే క‌ష్టాలు ఏమిట‌న్న‌ది ప్ర‌త్యేక్షంగా అర్ద‌మ‌వుతోంది. ఏదైనా స‌రే త‌న వ‌ర‌కు వ‌స్తేనేగాని క‌ష్టం అర్ధ‌మ‌వుద్ది అన్న‌ట్లు.. ఇటీవ‌లె స్టార్ హీరోతో స్టార్ డైరెక్ట‌ర్ సినిమాని మొద‌లు పెట్టిన  విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం త‌న సొంత బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతుంది. దీనికోసం ఆ ద‌ర్శ‌కుడిని తండ్రి, కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి టార్చ‌ర్ పెడుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

 

ఇటీవ‌లె సంక్రాంతి బ‌రిలో  తెర‌కెక్కిన ఓ స్టార్ హీరో  చిత్రాన్ని ఆ ద‌ర్శ‌కుడు అతి త‌క్కువ కాలంలో 120 రోజుల్లో సినిమా మొత్తం పూర్తి చేశాడ‌ని స‌మాచారం. అంతే నిర్మాత‌ల‌కు ఇచ్చిన టైంక‌న్నాకూడా చాలా త్వ‌ర‌గా షూటింగ్‌ని పూర్తి చేశాడు. మ‌రి ఇదిలా ఉంటే... ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో ఈ విష‌యం గురించి ప్ర‌స్తావిస్తూ... నిర్మాత‌లు చాలా త్వ‌ర‌గా పూర్తి చేశార‌ని నిర్మాత‌ల‌కు అలా చేస్తే ఇబ్బంది ఉండ‌దంటూ అలాగే  త‌న సినిమాని కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలంటూ చెప్ప‌క‌నే చెప్పారు ఆ స్టార్ హీరో. దీంతో ఆ స్టార్ డైరెక్ట‌ర్‌ వేదిక మీద ఏమీ మాట్లాడ‌లేక స‌రేనంటూ మాట ఇచ్చారు. ఇక అక్క‌డి నుంచి మొద‌ల‌యింది ఉరుకులు ప‌రుగులు. కాస్త కూడా విరామం అనేది లేకుండా ప‌గ‌లు రాత్రి షూటింగ్ చేస్తూ ఇటు ఆయ‌న ఇబ్బంది ప‌డుతూ అటు ఆ హీరో చేత కూడా నిద్రాహారాలు మాన్పించి మ‌రీ సినిమాని ఎంతో వేగంగా పూర్తి చేస్త‌న్నార‌ని సమాచారం.  దాంతో పాటు ఆ నిర్మాత పెట్టే కండీష‌న్లు కూడా  ఆ ద‌ర్శ‌కుడు కాస్త ఎక్కువ‌య్యాయ‌ని స‌మాచారం. 

 

దీంతో  ఈ చిత్రం ఎందుకు ఒప్పుకున్నాన అన్నంత‌గా ఇబ్బంది ప‌డుతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  అందుకే సినిమా ముందుకు ఎంత మాత్రం క‌ద‌ల‌డం లేదు. ఓప‌క్క త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నే టెన్ష‌న్ మ‌రోప‌క్క అంత పెద్ద స్టార్ హీరోతో చేసే చిత్రం ఏమాత్రం ఎక్క‌డ‌న్నా కాస్త తేడా వ‌చ్చినా ఇటు ఫ్యాన్స్ నుంచి అలాగే అటు వారినుంచి కూడా ఇబ్బందులు ఉంటాయ‌ని ఎంతో ఆలోచ‌నాత్మ‌కంగా క‌ష్ట‌ప‌డి చేస్తున్నాడు ఆ ద‌ర్శ‌కుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: