చాలా మంది సామాన్య ప్రజలు పేకాట ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పేకాటలు బానిసలుగా మారి పేకటలో ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్న వారి విషయాన్ని పక్కన పెడితే.. సరదాగా నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు టైం పాస్ కోసం పేకాట ఆడేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఇక స్నేహితులతో సరదాగా పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే పేకాట సామాన్యులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం. సమయం దొరికిందంటే స్నేహితులతో పేకాట ఆడుతూ సరదాగా టైం పాస్ చేయడానికి చాలా మంది సెలబ్రెటీలు ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే సినీ  సెలబ్రిటీలకు ఎక్కువగా ఖాళీ సమయం దొరకదు కాబట్టి దొరికిన కాస్త సమయం లోనే ఇలా స్నేహితులతో పేకాట ఆడటం లాంటివి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 

 

 

 కాస్త సమయం దొరికినా పేకాట తోనే టైంపాస్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా... ఇలా  పేకాట ఆడుతూ ఓ కెమెరామాన్ చిక్కింది. ఇది కూడా బయట ఎక్కడో కాదండోయ్... సినిమా సెట్లోనే. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ  కత్రినా కైఫ్... బాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో అయినా అక్షయ్ కుమార్ సరసన సూర్య వంశీ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే సూర్య వంశీ చిత్రం షూటింగ్లో పాల్గొన్న సమయంలో  అందాల ముద్దుగుమ్మ కత్రినాకైఫ్ కు కాస్త ఖాళీ సమయం దొరికినట్లైంది. 

 

 

 వెంటనే తన సన్నిహితులతో కలిసి సినిమా సెట్లోనే పేకాట మొదలు  పెట్టేసింది. అందమైన వైట్  లెహంగా ధరించి నవ వధువును తలపిస్తున్న ట్లుగా ఉంది ఈ ఫోటోలు కత్రినా కైఫ్. భారి ఆభరణాలు సైతం ధరించి ఉంది. వధువు గెటప్ లో ఉన్న అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్... సినిమా సెట్లో  ఖాళీ సమయం దొరకడం తో.. ఇలా తన సన్నిహితులతో కలిసి పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: