నటీనటులన్నాక కొందరికి ఇలాంటి పాత్రల్లో ఒక్క సారైనా నటించాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. అలా ఎందరో తమకు ఇష్టమైన పాత్రలు చేసి సంతృప్తి చెందిన వారు ఉన్నారు. మరికొందరు తమకు నచ్చిన పాత్ర దొరక్క, ఏదో వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కోవలోకే మిల్కి బ్యూటీ తమన్నా, చేరింది. ఏన్నో వైవిధ్యమైన పాత్రలతో, కుర్రకారు గుండెలని తన తెల్లతోలుతో కుళ్లబొడిచే ఈ అందాల భామ దాదాపు దశాబ్దం పైగానే హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

 

 

ఇకపోతే చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో 2005లో హిందీలో అడుగుపెట్టిన తమన్నా, అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. ఈ మూడూ చిత్రాలు ఆశించిన స్దాయిలో విజయాన్ని అందించలేక పోయాయి. కానీ 2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి.. తమన్నాకు హీరోయిన్‌గా గుర్తింపును తీసుకువచ్చాయి..

 

 

ఆ తర్వాత కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో  2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో తిరుగులేని గుర్తింపు సాధించిన తమన్నా ఆపై యువహీరోలతో వరుసగా జతకట్టి తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆపై హిమ్మత్‍వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగు పెట్టింది. ఇకపోతే గ్లామర్ పాత్రలు చేసి చేసి విసుగొచ్చిన తమన్నా ఇప్పుడు కొంత భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 

 

కానీ ఆమె మనసులో ఇప్పటివరకు చేయని ఓ డ్రీం రోల్ ఉందట .. ఆ పాత్ర పోషించే ఛాన్స్ రాలేదని అంటోంది. ఇంతకీ ఆ డ్రీం రోల్ ఏమిటో తెలుసా .. పూర్తిగా డాన్స్ ప్రధానంగా సాగె పాత్రలో నటించాలని. ఇక తమన్నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే డాన్స్ ప్రధానంగా ఉన్న పాత్రలో నటించాలనే కోరిక తీరలేదు.  అని బాధపడుతుందట.. చూద్దాం త్వరలోనే ఆమె కోరిక తీర్చే డైరెక్టర్ దొరక్కపోతాడా అని అభిమానులు అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: