టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా అనే సినిమాలోని ఒక చిన్న పాత్రతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు. అనంతరం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన విజయ్, హీరోగా చేసిన ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అనంతరం యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విజయ్, ఆపై పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. 

 

అయితే ఇటీవల మాత్రం ఒకింత పరాజయాలు అందుకుంటున్న విజయ్, ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు ఫైటర్ అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, నెక్స్ట్ విజయ్ మరొక్కసారి పరశురామ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా విషయమై ఇప్పటికే పరశురామ్ విజయ్ కు ఒక మంచి స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని, అయితే అది నచ్చిన విజయ్, దానిని పూర్తి స్క్రిప్ట్ గా రూపొందించిన తరువాత మొదలెడదాం అని మాటిచ్చాడట. మరోవైపు పరశురామ్ కూడా అతి త్వరలో నాగ చైతన్య తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

ఈలోపు విజయ్ కమిట్మెంట్స్ కూడా పూర్తి అవుతాయని, ఆ తరువాతనే తామిద్దరి కాంబినేషన్ మూవీ మొదలెట్టొచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కనుక కార్యరూపం దాలిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో మరొక గీత గోవిందం రేంజ్ హిట్ రావడం ఖాయం అని, ఒకవేళ ఆ సినిమా గీత గోవిందం కు సీక్వెల్ కూడా అయినా అయి ఉండవచ్చని అంటున్న వారు కూడా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఎటువంటి సినిమా వస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: