క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్ బాబు రెండో కొడుకు మంచు మ‌నోజ్‌. ఇటీవ‌లె మ‌నోజ్ వివాహ సంబంధాన్ని బ్రేక‌ప్ చేసుకున్న విష‌యం తెలిసింది. త‌న భార్య ప్ర‌ణ‌తికి విడాకులు ఇచ్చ‌న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించి అంద‌రూ అవాక్క‌య్యేలా చేశారు. ఇక సినిమా పరంగాను మంచు మనోజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ...  సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. స్పెషల్ ఈవెంట్స్ అప్పుడ‌ప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ అంద‌ర్నీ ఆక‌ర్షిస్తూ ఉంటారు.

 

ఇక ఆయ‌న త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా ఈ వారంలో త‌న ఫ్యాన్స్‌కి ఒక ఆశ‌క్తిక‌ర విష‌యాన్ని తెల‌ప‌నున్న‌ట్లు పోస్ట్ పెట్టారు. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియా అంతా వైర‌ల్ అయింది. 

 

 ఇక నెటిజ‌న్లు దీని మీద తెగ ఇంట్ర‌స్ట్ చూపిస్తూ ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పెట్ట‌డం మొద‌లు పెట్టారు. ఏంటి అన్నా..? మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నావా? కొత్త వదిన వస్తుందా? మళ్లీ పెళ్లా? కొత్త వదిన కోసం వెయిటింగ్ అన్నా? మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఆయన పెళ్లిపై ఫన్సీగా స్పందిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌ స్పందిస్తూ ‘వామ్మో’ అని రిప్లై ఇచ్చారు మంచు మనోజ్.

 

ఇక మ‌నోజ్ చేసిన ఈ ట్వీట్ పెళ్ళి గురించి కాద‌ని.. త‌న త‌ర్వాత చిత్రం గురించని తెలుస్తుంది. అయితే మ‌నోజ్ ఒక కొత్త బ్యాన‌ర్‌ను పెట్టిన‌ట్టు సినీ వ‌ర్గాల నుంచి ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి మనోజ్ చెప్పే ఆ కొత్త విషయం ఏంటో తెలియదు కాని.. పెళ్ళి పెళ్ళి అంటూ ట్వీట్ల‌తో సోష‌ల్ మీడియా అంతా హంగామా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: