తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ ప్రమాదంలో గాయపడడం దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఓ కార్యక్రమం కోసం రజనీ షూటింగ్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బండిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నిన్న షూటింగ్ జరిగింది. ఆ సందర్భంగా రజినీకాంత్ భుజానికి, కాలికి గాయాలు కావడంతో అకస్మాత్తుగా ఆయన షూటింగ్ ను రద్దు చేసుకుని అకస్మాత్తుగా చెన్నైకి వెళ్లిపోయారు. ఈ షూటింగ్ కోసం కర్ణాటక బండిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు ముందుగా ఓ ప్రత్యేక హెలికాప్టర్లో రజనీ వెళ్లారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో విస్తరించిన ఈ దట్టమైన అడవిలో ఆ కార్యక్రమం కోసం రెండు రోజుల పాటు డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకున్నారు.


 రోజుకు ఆరు గంటలు మాత్రమే అక్కడ షూటింగ్ చేసుకునేందుకు కర్ణాటక అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఊహించని విధంగా రజిని ఇలా గాయాలపాలు అవడంతో షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో పాటు రజనీ ఫ్యాన్స్ ఆందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ ప్రత్యేక కార్యక్రమం ఏంటి అంటే డిస్కవరీ ఛానల్ ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం. ఈ పోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ ప్రోగ్రాంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. మొత్తం ఈ కార్యక్రమాన్ని బేర్ గ్రిల్స్‌ హోస్ట్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా సాగే ఈ కార్యక్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా  పాల్గొన్న సంగతి తెలిసిందే .


మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ  కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవుల్లో తిరుగతూ, నదులు, కొండ ఎక్కుతూ సహస కృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటాడు. అంతే కాకుండా అడవిలో ఎటువంటి ఆహార సదుపాయాలు లేకపోయినా ‎అడవుల్లో దొరికే చిన్న చిన్న ప్రత్యామ్న్యాయ మార్గాల ద్వారా ఏ విధంగా బతకవచ్చో ఈ కార్యక్రమంలో చూపిస్తూ ఉంటాడు. అందుకే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: