టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఓవైపు ఇప్పటికే బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్న రాజమౌళి, తొలిసారిగా మెగా, నందమూరి స్టార్ హీరోలిద్దరితో నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని తొలుత సినిమా యూనిట్ జులై 30న రిలీజ్ చేస్తాం అని ప్రకటించింది. 

 

అయితే గత కొద్దిరోజలుగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందని, అనుకున్న విధంగా కాకుండా సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇకపోతే నేడు అది కూడా కరెక్ట్ కాదని, ఏకంగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకువెళ్లే ఛాన్స్ కనపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని, ఒకటి ఇప్పటికే మెగాస్టార్ - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా దసరాకు రిలీజ్ కాబోతుండడంతో పాటు, 

 

బాలయ్య - బోయపాటిసినిమా కూడా అదే సమయంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో, తమ సినిమా రిజల్ట్ విషయంలో ఏ మాత్రం తేడకొట్టినా ఆ దెబ్బ వేరేలా ఉంటుందని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ కొంత ఆలోచనలో పడిందని, అయితే అది మాత్రమే కాక, దసరాతో పోలిస్తే సంక్రాంతి పండుగ సమయంలో సినిమాకు మరింతగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండడంతో దర్శకుడు రాజమౌళి కూడా సంక్రాంతి అయితేనే బెటర్ అని భావిస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు ఇది అతి పెద్ద షాకింగ్ వార్తే అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: