నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం వి అనే సినిమాతో పాటు టక్ జగదీశ్ అనే సినిమాలు తెరక్కుతున్నాయి. అయితే వి సినిమాలో నెగటివ్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇక టక్ జగదీష్ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక న్యూస్ కొన్ని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. దానిని బట్టి, ఈ సినిమాను కొన్నేళ్ల క్రితం శోభన్ బాబు, రాజశేఖర్ హీరోలుగా తెరకెక్కిన మల్టి స్టారర్ మూవీ బలరామకృష్ణులు అనే సినిమా స్టోరీ లైన్ స్ఫూర్తిగా దర్శకుడు తెరకెక్కించనున్నట్లు టాక్. 

 

కథ ప్రకారం ఆ సినిమాలో శోభన్ బాబు, రాజశేఖర్ ఇద్దరూ కూడా  సోదరులు అయినప్పటికీ, ఒకరంటే మరొకరిది పడదు సరికదా, ఇద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉంటాయి. అయితే రాను రాను సినిమా గడిచిన కొద్దీ జరిగిన గతాన్ని తెలుసుకున్న అన్నదమ్ములు చివరకు ఏకమై శత్రులువుల మీద పగతీర్చుకుంటారు. అయితే ప్రస్తుతం దాదాపుగా ఇదే లైన్ లో టక్ జగదీశ్ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. అయితే బలరామకృష్ణులు సినిమా పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కగా, ఈ సినిమా మాత్రం ఒకింత మోడరన్ స్టైల్ లో తెరకెక్కనున్నట్లు చెప్తున్నారు. 

 

కాగా ఈ బలరామకృష్ణులు లో రాజశేఖర్ పాత్ర ఛాయలు నాని పాత్రలో, అలానే శోభన్ బాబు పాత్ర ఛాయలు జగపతిబాబు పాత్రలో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే తాను తెరక్కెక్కించిన నిన్ను కోరి, మజిలీ సినిమాలతో మంచి హృద్యమైన కథలను తెరకెక్కించగల దిట్టగా పేరు సంపాదించిన శివ నిర్వహణ, ఈ సినిమాలో కూడా కొన్ని బలమైన ఎమోషనల్ సీన్స్ ని రాసుకున్నట్లు టాక్. మరి అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: