2000 సంవత్సరం లో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిచిన ‘యువకుడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందమైన తార భూమిక చావ్లా. సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా తనకు వరకు వచ్చిన ప్రతి పాత్ర ని ఒప్పుకుంది. అందుకే జూనియర్ ఎన్.ట్.ఆర్ నుంచి, మెగాస్టార్ చిరంజీవి , వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ హీరోలందరితోను నటించిది. భూమిక అంటే లక్కి హీరోయిన్, సక్సస్ ఫుల్ హీరోయిన్ అని తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుంది. ఖుషీ, సింహాద్రి, మిస్సమ్మ, ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా ఫేమస్ అయింది. ఇక హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినప్పటికీ సినిమాల మీద మాత్రం ఇష్టం తగ్గలేదు. 

 

అందుకే చిన్న చిన్న పాత్రలు వచ్చినప్పటికి అస్సలు ఏ మాత్రం వదలడం లేదు. అందులో భాగంగానే ఈ సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చి అక్క, వదిన పాత్రలు చేస్తూ ఇంకా మంచి పాత్రలకోసం చూస్తోంది. ఇప్పటికే.. నాని సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’, ‘సవ్యసాచి’ సినిమాల్లో అక్క పాత్రలో నటించి.. తన క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసింది.
సాధారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫామ్, క్రేజ్ లో ఉన్నప్పుడే వరుసగా హీరోయిన్ గా సినిమా అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేయాల్సిందే. అందుకు ఉదాహరణగా ఈ మధ్య చాలామందినే చూస్తున్నాము. కాబట్టే సినిమాలంటే ఫ్యాషన్ ఉండి గ్రాండ్ గా సక్సెస్ అయ్యారు కూడా. అలాంటి వారిలో భూమిక కూడా ఉందని చెప్పుకోవచ్చు.

 

ఇక భూమిక తాజాగా గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో హీరోకు అక్కగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్క పాత్రలో నటించి మెప్పించిన భూమకనే మరోసారి ‘అక్క’గా నటించాలని అడగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. భూమిక పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందట. అంటే అక్క పాత్రలో భూమిక తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరని దర్శకుడు సంపత్ నంది డిసైడైయ్యాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. ఈ మధ్య స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే అయ్యాయన్న సంగతి తెలిసిందే. మజిలీ, జెస్రీ ఆ తరహా చిత్రాలే. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుండో చూడాలి. అయితే భూమిక ని ఇప్పటీ కొందరు అక్క పాత్రలో చూడలేకపోతున్నారట. సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా చేయమని చెబుతున్నారట. మరి భూమిక కి అలాంటి అవకాశాలు వస్తాయో లేదో. 

మరింత సమాచారం తెలుసుకోండి: