ప్రస్తుతం టాలీవుడ్ లో ఏకైక పాన్ ఇండియా స్టార్ అంటే డార్లింగ్ ప్రభాస్ ఒక్కడే అని చెప్పక తప్పదు. స్టార్ హీరోలున్నప్పటికి ఈ రేంజ్ ఇంకే హీరోకి లేదన్నది వాస్తవం. అందుకు బాహుబలి, సాహో సినిమాలే నిదర్శణం. బాహుబలి స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నార్త్ లో డార్లింగ్ ప్రభాస్ పేరు మార్మోగుతోంది. అంతేకాదు జపాన్ సహా చాలా విదేశాల్లో వీరాభిమానులున్నారు. మలేషియా.. చైనా.. కొరియాలోనూ డార్లింగ్ ఫ్యాన్స్ ని బాగా సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్  బాధ్యత విపరీతంగా పెరిగింది. ఆయన ఎంచుకునే ప్రతి స్క్రిప్టు, దర్శకుడు ఎంతో కీలకం.

 

అయితే పెరిగిన క్రేజ్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ప్లాన్స్ చూస్తుంటే అమాతం ఆశ్చర్యం కలగక మానదు. ప్రభాస్ ఇప్పటికీ కొత్త ట్యాలెంట్ మీదే నమ్మకంగా ఉన్నాడు. కుర్ర దర్శకులు ఇన్నోవేటివ్ స్క్రిప్టులతో వస్తే చాన్స్ ఇచ్చేందుకు ఎంత మాత్రం వెనకాడనని ప్రామిస్ చేశాడు. పాత దర్శకులు పాత చింతకాయ స్క్రిప్టుల కంటే కొత్త దర్శకులతో కొత్త పంథా సినిమాలే చేయాలని డిఫ్రెంట్ గా ఆలోచిస్తున్నాడు. ప్రభాస్ ఆలోచనా ధోరణి చూస్తుంటే స్క్రిప్టు స్ట్రాంగ్ గా ఉంటే చాలు..కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వెనకాడడని అర్థమవుతోంది.

 

ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్.. రాధాకృష్ణ ల ఇద్దరికీ అవకాశం ఇచ్చిన ప్రభాస్. ఇప్పటికీ కొత్త వాళ్లకే ఛాయిస్ అంటున్నాడు. అసలు జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం మంచి కథల్ని.. క్రియేటివిటీ ఉన్న దర్శకులని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతోనే ప్రభాస్ ఉండటం గొప్ప విషయం. ఇది యంగ్ డైరెక్టర్స్ కి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఒకరిద్దరు యువ దర్శకులు ప్రభాస్ కి కథలు చెప్పే ఆలోచనలో ఉన్నారట. అలాగే ఇప్పటికే డెబ్యూలుగా సినిమాలు తీసి నిరూపించుకున్న దర్శకులకు ప్రభాస్ వద్ద పని సులువుగానే అయ్యే అవకాశం ఉందిట. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందుకు తగ్గట్టే అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు స్క్రిప్టు యూనివర్శల్ గా ఉండాలి. సేమ్ టైమ్ బడ్జెట్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలని రూల్స్ పాటించాలి. అంతే ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం మీదే ఆధారపడి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: