బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే డెభ్బై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర చిత్రీకరణలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా పాల్గొన్నాడు.

 

 

ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కావాలి. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల సినిమా విడుదల మరింత జాప్యం కానుంది. అయితే ఈ జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా సినిమా అనుకున్నప్పుడు ఎన్టీఆర్ కి జోడీగా డైసీ ఎడ్గార్ ని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

 

 

దాంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. మొన్నటికి మొన్న ఒలివియా మోరిస్ ని ఎన్టీఆర్ ని తీసుకున్నారు. ఎన్టీఆర్ కి జోడీ దొరకడం ఆలస్యమవడంతో  వారిద్దరి మధ్య ఉండే సీన్లు షూటింగ్ చేయలేదు. ఇక మరో కారణం, రామ్ చరణ్ కి గాయం అవడం. షూటింగ్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ చేతికి గాయం అవడంతో ఒక నెల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక మరో కారణం రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్ళి.

 

 

పెళ్లి కారణంగా రాజమౌళి పదిరోజులు షూటింగ్ మానేయాల్సి వచ్చింది. ఇవన్నీ కారణాలు సినిమాని మరింత ఆలస్యం చేశాయి. అయితే జులై 31 న రిలీజ్ కావడానికి అవకాశం లేనందున మరో కొత్త తేదీ కోసం అన్వేషిస్తున్నారు. అయితే దసరా వరకి కూడా సినిమా పూర్తవుతుందన్న నమ్మకం లేకపోవడంతో మళ్లీ సంక్రాంతికే విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: