టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు నిఖిల్.  కెరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిఖిల్ అదృష్టం కొద్ది శేఖర్ కమ్ముల దర్శకత్వంతో నటించడం మంచి హిట్ సాధించడం జరిగింది. ఆ తర్వాత సోలోగా కొన్ని సినిమాల్లో నటించినా పాపం ఏ ఒక్కటీ కలిసి రాలేదు.  ఇక కలర్స్ స్వాతి - నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా, కార్తీకేయ సూపర్ హిట్స్ అందుకున్నాయి. అంతే అప్పటి నుంచి మనోడి జాతకం పూర్తిగా మారిపోయింది.  వరుసగా సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ మంచి విజయాలు అందుకున్నాయి.  తర్వాత వస్తున్న సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.  ఇటీవల అర్జున్ సురువరం సినిమాతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు.

 

 ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు.  ఈ నేపథ్యంలో నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే.  పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. ఇక మొత్తానికి కొంత మంది కుర్ర హీరోలు 2020లో పెళ్లికి సిద్ధం కాబోతున్నారు.  మొత్తానికి నితిన్ ఒక ఇంటి వాడు కాబోతున్నారు.  అదే తరహాలో మరో కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా పెళ్లికి సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది.

 

అసలైతే రెండేళ్ల క్రితమే ఈ హీరో పెళ్లి కావాల్సింది. కానీ జాతకాలు కలవలేదని ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. ఈ మద్య అర్జున్ సురవరం సినిమాతో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతానికి రెండు సినిమా కథలను సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. మరీ నిఖిల్ ని కట్టుకోబోయే ఆ సుందరి ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: