సినిమా ప్రపంచంలోకి ఒకసారి అడుగుపెట్టిన తరువాత మనకు దొరికిన అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగడామె, అలానే ప్రతి ఒక్కరూ కూడా విజయం కోసమే పని చేస్తారు కదా. అయితే ఆ విజయం దక్కాలంటే కొంత మనకు రాసి పెట్టి ఉండాలి కూడా. ఇక అదే విధంగా ఒక్కోసందర్భంలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎక్కువసార్లు యాదృచికంగానే జరుగుతూ ఉంటుందనే చెప్పాలి. ఆ విధంగా మనం చేయదలుచుకున్న సినిమాలు వేరొకరు చేయడం వల్లన వారికి కలిసి వస్తే లాభం జరుగుతుంది, లేదా నష్టం జరుగుతుంది. ఆ విధంగా టాలీవుడ్ నటుడైన నాచురల్ స్టార్ నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా మనకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 2012లో కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాని

 

సమంత జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా విషయమై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మ్యాటర్ బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమాని చేయవలసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అట. ముందుకు గా దర్శకుడు గౌతమ్ మీనన్, రామ్ చరణ్ కు కథ వినిపించడం, అది నచ్చిన చరణ్, వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అయితే సరిగ్గా సినిమా మరికొద్దిరోజుల్లో మొదలెడదాం అనుకున్న సమయంలో చరణ్ కు కాల్షీట్స్ అడ్జస్ట్ కాని పరిస్థితి ఎదురైందని, 

 

అదే సమయంలో గౌతమ్ గారిని ఇబ్బందిని పెట్టడం ఇష్టం లేని చరణ్, ఆ సినిమాని వేరే హీరోతో చేసుకోండి అని సలహా ఇచ్చారట. అయితే సరిగ్గా అదే సమయంలో నానిని గౌతమ్ కలవడం, వెంటనే ఆ కథ విని నచ్చిన నాని, వేగంగా షూటింగ్ మొదలెట్టమని కోరడంతో చకచకా షూటింగ్ ప్రారంభం అయి సినిమా కూడా పూర్తి అయిందట. అయితే రిలీజ్ తరువాత పెద్దగా సక్సెస్ సాధించని ఆ సినిమాలో నటనకు గాను హీరో నాని, హీరోయిన్ సమంతలకు నంది అవార్డులు లభించడం విశేషం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: