తెలుగు లో maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తర్వాత అదే మూవీలో తన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే సమంత వివాహం తర్వాత సినిమాలకు దూరం అవుతుందని అందరూ భావించారు. ఒకదశలో సమంత ఫ్యాన్స్ అయితే నిరాశలో మునిగిపోయారు.  కానీ అందరి అంచనాలు తప్పిస్తూ సమంత పెళ్లైన మూడు నెలల తర్వాత వరుసగా సినిమాలు తీయడం అవికూడా సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. తాజాగా ఈ అమ్మడు జాన్ సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది.  ఇందులో మరోసారి సమంత తన విశ్వరూపం చూపించినట్లు అనిపిస్తుంది. క‌థ‌, పాత్ర ప‌రంగా ప్రాముఖ్య‌త ఉన్న సినిమాల్లో న‌టిస్తున్న హీరోయిన్ స‌మంత అక్కినేని. 

 

శర్వానంద్‌తో క‌లిసి న‌టిస్తున్న మూవీ `జాను`. ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది.  ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా  ఓ అభిమాని జాను అని పేరు రాసుకుని ఐ ల‌వ్ యు సామ్ అంటూ మూడు గంట‌ల 15 నిమిషాలు పాటు రాసి దాన్ని వీడియో తీసి ట్వీట్ చేస్తూ స‌మంత‌ను ట్యాగ్ చేశాడు. అయితే దీన్ని రాయడానికి మూడు గంటల పదిహేను నిమిషాలు పట్టింది. ఆ సమయంలో నన్ను మా అమ్మ కూడా తిట్టింది. 

 

అయినా వదలకుండా రాశాను అన్నాడు. దానికి సమంత రిప్లై ఇస్తూ మీ అభిమానానికి థాంక్స్‌. మీరు చేసిన ప‌నికి మీ అమ్మ‌గారు నన్ను కూడా తిడ‌తారు అని ఫ‌న్నీగా రిప్లై ఇచ్చింది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న సమంత ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలో బాగా తెలుసు అని నటిజన్లు అంటున్నారు.  ఈ మూవీ తర్వాత నానితో మరో మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ హిట్ అయితే సమంతకు కొంత కాలం తిరుగేలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: