ఈ మధ్య బాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సినిమా నితిన్ భీష్మ. ఈ సినిమా ని ముందు అనౌన్స్ చేసినప్పుడు అంతగా బజ్ ఏర్పడ లేదు గాని ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి నెమ్మదిగా కాస్త హైప్ రావడం మొదలైంది. వాస్తవంగా నితిన్ గత చిత్రాలు ఫ్లాప్ అవడంతో కొంత నిరాశ చెందాడు. అందుకే కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో మంచి కథలని సెలెక్ట్ చేసుకున్నాడు. వాటిలో ముందు భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

 

అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న తో నితిన్ పోస్టర్స్ ఆద్యంతం ఆసక్తిని రేకిస్తున్నాయి. గీత గోవిందం, సరిలేరు సినిమాలతో రష్మిక క్రేజ్ ఇండస్ట్రీలో బాగా పెరిగిపోయింది. అదే ఊపులో రష్మిక ఇప్పుడు నితిన్ తో నటిస్తున్న సినిమాకి బాగా క్రేజ్ క్రియోట్ అవుతోంది. నితిన్-రష్మిక ల పేయిర్ అధ్బుతంగా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి. ముఖ్యంగా పోస్టర్స్ లో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా వర్కౌట్ అయినట్టుందే అన్నట్టు హైప్ బాగా వస్తోంది. వాస్తవంగా ఈ రేంజ్ రొమాంటిక్ పోస్టర్స్ ఈ మధ్య కాలంలో రాలేదనే చెపాలి.

 

అందుకే ఈ జంట గురించి సోషల్మ్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ పడుతున్నాయి. అవి రోజు రోజుకీ మరీ ముదిరిపోతున్నాయి కూడా. కొందరైతే నితిన్ పెళ్ళి చేసుకునే అమ్మాయి రష్మిక కంటే బ్యూటీగా ఉంటుందా అని అనుకుంటుంటే నితిన్ ఫ్యాన్స్ మాత్రం నితిన్ లైఫ్ పార్ట్నరే అద్భుతంగా ఉంటుందని చూసినట్టుగా రివర్స్ లో కామెంట్స్ పెడుతున్నారట. అవును మరి అందంగా లేకండా ఎలా ఉంటుంది చెప్పండి.   

త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న నితిన్ కి ఇంత అందమైన పెయిర్ దొరికిందో లేదో తెలీదు కానీ.. రష్మిక మాత్రం పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తోందని అంటున్నారు. అంతగా ఆ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు.. టీజర్ ప్రతిదీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సింగిల్స్ ఆంథెమ్ కి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా భీష్మ పాటల ప్రమోషన్ కూడా మొదలైంది.

 

ఫస్ట్ సింగిల్ 'వాటే బ్యూటీ'.. ఈనెల 31న రిలీజ్ కానుంది. ఇప్పుడు వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా రిలీజ్ కానుందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. రీసెంట్‌గా అల తో మంచి కమర్షియల్ సక్సస్ వచ్చి సితార మంచి ఫాం లోకి వచ్చిన సంగతి తెలిసందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: