‘ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య.  మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా.. నాగ‌శౌర్య మాత్రం టాలెంట్‌తో పైకి వ‌చ్చాడు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుని, త‌న న‌ట‌న‌తో మెప్పించే న‌గ‌శౌర్యకు కుర్ర‌కారులో ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్ప‌డింది. ఇక తాజాగా యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ’. 

 

ఛలో  సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథను తానే సొంతంగా రాసుకుని మ‌రీ అశ్వథ్థామ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.  మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల అయింది. అయితే నాగ‌శౌర్య‌ను ఉద్దేశించి కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీ‌రెడ్డి ఫేస్‌బుక్ వేధిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.  `నాగ‌శౌర లాంటి టాలెంటెడ్ అండ్ హ్యాండ్స‌మ్ హీరోస్‌ని తొక్కేయ‌కండిరా.. తొక్క‌లో మెగా హీరోస్ కోసం` అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

 

అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు పెద్ద దుమారం రేపుతున్నాయి. అలు మెగా అభిమానులు.. ఇటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. చిత్ర విచిత్రాలుగా కామెంట్లు పెడుతూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే శ్రీ‌రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం ఇదేం మొద‌టి సారి కాదు. ఎన్నో సార్లు వాళ్ల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కాగా, నాగ‌శౌర్య ప్ర‌స్తుతం అశ్వథ్థామ సినిమా జోష్ మీద ఉన్నాడు. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే అశ్వథ్థామ. నాగశౌర్య పెర్ఫామెన్స్, ఆసక్తిని కలిగించే సీన్స్ తో సినిమా ఆక‌ట్టుకుంటుంది. మరి నాగశౌర్యకి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: