టాలీవుడ్ లో ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి.  నటించాలనే తపన ఉన్న ఎంతో మంది అమ్మాయిలు కొంత మంది దళారుల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారని.. వారికి పడక సుఖం ఇస్తేనే ఛాన్సులు అన్న సాంప్రదాయం కొనసాగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పడక సుఖం ఇచ్చినా కొంత మంది అమ్మాయిలు దళారుల చేతుల్లో మోపపోతున్నారని.. అలాంటి వారిలో నేను ఒకదానిని అని మీడియా ముందు వాపోయింది శ్రీరెడ్డి. తనలా ఎంతో మంది అమ్మాయిల జీవితాలు సినిమా కోసం త్యాగం చేస్తున్నారని.. మోసగించే వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. 

 

ఆమె ఉద్యమం మద్యలోనే ఆపి ప్రస్తుతం చెన్నైకి వెళ్లి పోయింది. అయితే అక్కడ నుంచే ఆమె కాస్టింగ్ కౌచ్ పై తనదైన స్టైల్లో పోరాడుతుంది.. అలాగే సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ పై మరికొంత మంది నటీమణులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిలో ఉయ్యాలజంపాల ఫేమ్ గాయత్రి గుప్త.  టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఇండస్ట్రీ ఏదైనా కానీ ఛాన్సులు రావాలంటే  దర్శక నిర్మాతలతో పాటు హీరోలతో కూడా కమిట్ కావాల్సిందేనని చెప్పి సంచలనం  సృష్టించింది  నటి గాయత్రిగుప్త . 

 

కాస్టింగ్ కౌచ్ అన్న మాట పేరుకే కానీ.. ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరని  తెలిపింది.  అంతేకాదు  ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇష్ట పూర్వకంగానే కమిట్ అవుతున్నారని.. వాళ్లకు అవసరం.. ఎదుటోడి ఆనందంతోనే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఓపెన్ గా మాట్లాడింది.   అయితే తాను ఎప్పటి నుంచో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతున్నానని కానీ... కొంత మంది ఇష్టపూర్వకంగా చేస్తే తానేమీ చేయలేనని అన్నారు. అయితే అలా పడక సుఖం ఇచ్చినా ఛాన్సులు వస్తాయని ఆశిస్తే మాత్రం వెర్రితనం అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: