వరుసగా ఎనిమిది హిట్స్ ఇచ్చిన నానీకి ప్రస్తుతం సక్సెస్ గగనమైపోతోంది. ఏం చేసినా.. సరైన హిట్ దక్కడం లేదు. అందుకే ఈ సారి సక్సెస్ కోసం టక్ చేశాడు. నాని టక్ చేస్తే.. సినిమా హిట్ అవుతుందా..? నాని సినిమా వచ్చిందంటే.. మినిమం హిట్ అని లెక్కలేసుకునేవాళ్లు. అయితే.. కృష్ణార్జున యుద్ధంతో ఈ నమ్మకానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత దేవదాస్ తో మరో ఫ్లాప్ చూశాడు. జెర్సీ ఓకే మాత్రమే అనిపించుకుంది. లాస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం వి అనే సినిమా చేస్తున్నాడు. అష్టాచమ్మతో నానీని హీరోగా పరిచయం చేసిన krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహన్ కృష్ణ వి మూవీలో విలన్ని చేశాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ అవుతోంది. 

 

వి సినిమా రిలీజ్ కాకుండానే.. మరో సినిమా టక్ జగదీశ్ మొదలుపెట్టేశాడు నాని. గతంలో నిన్నుకోరి లాంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్స్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ నానీతో జత కడుతున్నారు. సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 11నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 

 

నానీ సినిమాల దర్శకులను చూస్తుంటే.. గతంలో హిట్ ఇచ్చిన వారినే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహన్ కృష్ణ అష్టాచమ్మా.. జెంటిల్ మెన్ లాంటి హిట్స్ ఇచ్చాడు. శివ నిర్వాణ, నాని కాంబోలో నిన్ను కోరి లాంటి సక్సెస్ ఎలాగూ ఉంది. త్వరలో భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మారుతీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.యస్ రామారావు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కెరీర్ అప్ అండ్ డౌన్ లో నడుస్తున్న ఈ టైమ్ లో.. హిట్ ఇచ్చిన దర్శకులనే నమ్ముకున్నాడు నాని. వరుసగా ఎనిమిది హిట్స్ ఇచ్చిన నానీకి ప్రస్తుతం సక్సెస్ గగనమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: