అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, విజయం ఆయనకు ఆమడ దూరంలో ఉండిపోతోంది. సినిమాలన్నీ పరాజయం అవుతున్నా, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు . తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా అందాల భామ పూజ హెగ్డే నటిస్తుంది.

 

గతంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100 పర్సంట్ ల‌వ్‌. ఈ చిత్రంలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా నటించగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత బ‌న్ని వాసు నిర్మించాడు. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం. మ‌ళ్లీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేనితో నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా 100 పర్సంట్ ల‌వ్‌కి డ‌బుల్ హిట్‌ని సాధిస్తుంద‌ని యూనిట్‌ అంతా కాన్ఫిడెంట్‌ ఉంది.

 

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్‌గా 100 పర్సంట్ ల‌వ్ నుంచి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రిప్ట్‌ల‌తో అప్‌డేటెడ్‌గా అల్లు అర‌వింద్.. స‌ల‌హ‌లు సూచ‌న‌ల‌తో బ‌న్ని వాసు యువ నిర్మాత‌గా స‌క్సెస్ రేట్ ఎక్కువుగా ఉన్న నిర్మాతలలో ఒకడిగా త‌న‌కంటూ ఓ ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. 

 

యంగ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని‌తో.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌రావు, అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను వంటి ల‌వ్ కమ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలీ అండ్ గ‌ర్ల్స్ సెక్టార్‌లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: