2018 అక్టోబర్ లో వచ్చిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96. సి.ప్రేం కుమార్ దరకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని సక్సస్ ని అందుకుంది. ఒకరకంగా ఈ సినిమా త్రిష కి మంచి కం బ్యాక్ మూవీ అని చెప్పాలి. నాయకి సినిమా తర్వాత త్రిష మళ్ళీ కనపడింది లేదు. దాంతో ఇక త్రిష పనైపోయింది. ఫేడవుట్ అయిపోయింది ..అన్న మాటలు ఒక్క దెబ్బతో చెత్త బుట్టలో పడ్డాయి. వాస్తవంగా 96 సినిమాకి కోలీవుడ్ లో ముందు అంతగా బజ్ క్రియోట్ అవలేదు. కారణం త్రిషకి ఫ్లాప్స్ వచ్చి సినిమాలు తగ్గిపోయాయి. అదీ కాక హీరో విజయ్ సేతుపతి అనేసరికి ఎవరికి ఈ సినిమా మీద అంతగా ఆసక్తి గాని అంచనాలు గాని లేకుండా పోయాయి. కానీ అందరికీ షాకిస్తూ ఈ సినిమా పెద్ద సక్సస్ అయింది. ఊహించని రీతిలో సక్సస్ అందుకున్న త్రిష కి ఈ సినిమా తర్వాతే వరుసబెట్టి సీనియర్ స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది.

 

ఇక ఇంత పెద్ద సక్సస్ అయిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రీమేక్ రైట్స్ కొనుక్కొని తెరకెక్కించాలని మోజుపడ్డారు. అయితే ఆ సినిమాలో నటించిన త్రిష , విజయ్ సేతుపతి లను మాచ్ చేసేవాళ్ళు మన దగ్గర ఎవరున్నారా అని తర్జన భర్జన పడ్డ రాజు గారు ఫైనల్ గా సమంత, శర్వానంద్ లను సెలెక్ట్ చేసుకున్నారు. గ్రాండ్ గా ఓపెనింగ్ చేనట్టుగా సినిమాని నిర్మించలేకపోయాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ సరిలేరు మీద కాన్సంట్రేషన్ తో 96 ని పట్టించుకోలేదు. అందుకే ముందు నుంచే ఈ సినిమాకి 96 టైటిల్ నే అనుకున్న దిల్ రాజు తర్వాత ఎందుకనో మనసు మార్చుకొని జాను అన్న టైటిల్ ని ఫిక్స్ చేసి పోస్టర్ ని రిలీజ్ చేశారు.  

 

అది తప్ప రాజు గారు ఈ సినిమాకోసం చేసిందేమీ లేదు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికి సినిమాని లైట్ గా తీసుకున్నారు. దాంతో అందరిలోను అనుమానాలు మొదలైయ్యాయి. త్రిష కి ఉన్న క్రేజ్ సమంత కి లేదా అంటూ దిల్ రాజు ని కడిగేస్తున్నారు. అందుకు కారణం మజిలీ, ఓ బేబి సినిమాలతో 2019 లో సూపర్ హిట్స్ అందుకుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంది. కానీ ఇపుడది అయ్యో పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి సరిగా ఎవరికీ తెలీదు. ఇక రిలీజయ్యాక రిజల్ట్ ఎలా వస్తుందోనని సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: