ప్రతి తెలుగు వాడు ఇది మన సినిమా సినిమా అని గర్వంగా చెప్పుకొనే చిత్రం... శంకరాభరణం. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు , ఉత్తమ గాయకురాలిగా వాణి జయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా  కె.వి.మహదేవన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. జంధ్యాల మాటలు, మహదేవన్ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం గాత్రం, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల అభినయ కౌశలం  ‘శంకరాభరణం’ సినిమాని వన్నెతరగని చిత్రరాజంగా నిలిపాయి.

 

ఈ చిత్రం ఎంతో గొప్ప చిత్రం కాబ‌ట్టే ఇందులోని స‌న్నివేశాల్ని నేటి చిత్రాల్లో కూడా కొన్ని సార్లు వాడుతున్నారు. అక్కినేని నాగార్జున న‌టించిన `కింగ్‌` చిత్రంలో బ్ర‌హ్మానందం  త్రిష ల మ‌ధ్య వ‌చ్చే ఓ స‌న్నివేశం ఇప్ప‌టికి చూస్తుంటే చాలా స‌ర‌దాగా ఉంటుంది. ఆ సీన్ ఎన్ని సార్లు చూసినా జ‌నాల‌కి బోర్ కొట్ట‌దు. బ్ర‌హ్మీ త్రిష‌కు లైన్ వేస్తూ ఆమె పాట పాడుతుంటే శంక‌రాభ‌ర‌ణంలో రాజ్య‌ల‌క్ష్మి - చంద్ర‌మోహ‌న్ మ‌ధ్య వెరీ ఈజ్ ద రొమాన్స్ అంటే నాగార్జున చెంప‌లు వాయిస్తాడు. అలా ఎన్నేళ్లు అయిన సినిమాల్లో కూడా ఆ సినిమా ప్ర‌స్తావ‌న ఉంటుంది. సామజ‌వ‌ర‌మ‌గ‌న అని త్రిష పాడుతుంటే బ్ర‌హ్మానందం ఆపాట‌లోని తిరిక్ ఏంటి నువు పాడేదేంటి. అంటూ అక్క‌డ వ‌చ్చే స‌న్నివేశం ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తు ఉంటుంది. 

 

తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన . శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో  ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: