కార్తికేయ సినిమాలో హీరో నిఖిల్ ఒక డాక్టర్ అయినటువంటి హెరాయిన్ స్వాతి ని ప్రేమించి, పోరాడి పెళ్లి చేసుకుంటాడు. అందులో తనకు డాక్టర్ స్వాతి ఒక లక్కీ అంటూ పడే పఫ్డ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా దేనికి అని అనుకుంటున్నారా...  కార్తికేయ సినిమా లో లాగే మన వాడు ఒక డాక్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.వామెను వివాహం కూడా చేసుకోబోతున్నాడు. 

 

హ్యాపీ డేస్ తో సినీ తెరకు పరిచయమైనా ఈ హీరో, స్వామిరారా మూవీ తో హిట్ కొట్టి ఇండస్ట్రీ లో నిల దొక్కుకున్నాడు. ఆ తర్వాత వచ్చినా అతని సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గానే కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు తన జీవితంలో తాను ఇంకో అడుగు వేయబోతున్న్నాడు. తానూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

 

కొన్ని సంత్సరాలుగా తానూ ప్రేమిస్తున్న డాక్టర్ డాక్టర్ పల్లవి వర్మతో తాను ఏడూ అడుగులు వేయబోతున్నాడు. ఇద్దరి కుటుంబాల్లోని పెద్దల అంగీకారం తోనే వారు ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వారి ఇద్దరి యంగ్ ఏజ్ మెంట్ కూడా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

 

కావున వారు ఇద్దరు దిగిన ఫోటోలను హీరో నిఖిల్ తన అభిమానుల కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తాను తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్నట్టు వుంది. ప్రస్తుతం కార్తీయేయ 2 సినిమాలో బిజీ గా ఉన్న నిఖిల్, తన నిచితార్ధపు డేట్ ను అనౌన్స్ చేసేశాడు. వారిదారి నిశ్చితార్థం ఈ నెల 15 వ తేదీన హైద్రాబాదులో ఘనంగా చేయబోతున్నారు.

 

నిఖిల్ పోస్ట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నీతింత చకార్లు కొడుతున్నాయి. అతనికి తన అభిమానులు, సినీ ఇండస్ట్రీ నుండి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ఇన్నాళ్లకు నిఖిల్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు అనమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: