టాలీవుడ్ బాద్షా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయమ్ తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ పింక్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పవన్ కళ్యాణ్ తర్వాతి చిత్రాలని కూడా ప్రకటించాడు. మొత్తం ఇప్పటి వరకు నాలుగు సినిమాలని ఒప్పుకున్నాడు.

 

 

పవన్ కళ్యాణ్ సినిమాలని మానేస్తున్నాడని తెలియగానే ఆయన అభిమానులు చిన్నబోయారు, కనీసం ఏడాదికి ఒక్క సినిమానైనా చేస్తే బాగుంటుందని అనుకున్నారు.  పవన్ మాత్రం మళ్లీ సినిమాల్లో నటించనని చెప్పారు. అభిమానుల ఆశ మాత్రం చావలేదు. బహుశా ఆ ఆశ బలంగా ఉండడం వల్లేనేమో పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు. అయితే అందరు హీరోలకీ అభిమానులు ఉంటారు.

 

 

అందరు అభిమానులు వేరు. పవన్ అభిమానులు వేరు. పవన్ కళ్యాన్ కి ఎంత తిక్క ఉంటుందో పవన్ అభిమానులకి కూడా అంతే తిక్క ఉంటుంది. అలాంటి తిక్క ఉన్నవారే పవన్ అభిమానులు అవుతారెమో..సాధారణంగా ఒక హీరో సినిమా బాగుంటేనో, డాన్సులు బాగా చేస్తాడనో, మచి కథలు ఎన్నుకుంటున్నాడనో అభిమానులుగా మారతారు. కానీ పవన్ కి అభిమానులుగా మారేవారు వేరుగా ఉంటారు. ఆయన సినిమాల ద్వారా కాకుండా, ఆయన సమాజానికి  చేసే పనుల ద్వారా అభిమానులుగా మార్చుకుంటారు. 

 

 

 

అందుకే పదకొండు వరుస ఫెయిల్యూర్ లు ఎదురైనా కూడా పవన్ అభిమానులు పవన్ తోనే ఉన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాన్ ఫ్యాన్ అయితే కట్టె కాలేవరకు పవన్ ఫ్యాన్ గానే ఉండిపోతారు. ఇవి నేనంటున్న మాటలు కాదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు అన్న మాటలివి. అంతలా మాయజాలం చేసే మహత్తు పవన్ కే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: