పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ పేరు చెప్పగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయే అభిమానులు ఎంతో మంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఒక సాదాసీదా హీరోగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బాద్ షా గా మారిపోయాడు. అభిమానుల పవర్ స్టార్ గా మారిపోయాడు. ఎంతో మంది దర్శక నిర్మాతలకు ఫేవరెట్ హీరో అయిపోయాడు. నాకిష్టమైన స్నేహితుడు... నా సునామి.. నా ఉప్పెన.. నేను దాచుకున్న నా సైన్యం... నేను శత్రువుతో చేసే యుద్ధం.. నేను ఎక్కుపెట్టిన బాణం.. నా పిడికిటి లో ఉన్న వజ్రాయుధం.. నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు.. ఈ మాటలు పవన్ కళ్యాణ్ కోసం మాటల మాంత్రికుడు చెప్పినవే... కానీ ప్రతి అభిమాని గుండె లోతుల్లో ఉండే మాటలు ఇవే. 

 

 

 పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  అందం. ఒక్క చిరునవ్వుతోనే వేల మంది మనుసులను దోచుకో గల సత్తా పవన్ కళ్యాణ్  సొంతం. అందరు హీరోల్లాగా సరికొత్త స్టైల్స్ పవన్ కళ్యాణ్ గిట్టవు. బయట ఎంత సింపుల్ గా కనిపిస్తారో  సినిమాలో కూడా అంతే సింపుల్ గా కనిపిస్తారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ డ్రెస్ వేసిన అది ఒక సెన్సేషన్ గా మారిపోతుంది... పవన్ కళ్యాణ్ చిరునవ్వు నవ్విన అందమే... పవన్ కళ్యాణ్ ఏ చిన్న స్టెప్  చేసిన అందమే... పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన అందమే... పవన్ కళ్యాణ్ పంచ కట్టుకట్టి  అలా నడుచుకుంటూ పోయినా అందమే. పవన్ కళ్యాణ్ ఏం చేసిన అది అందంగానే కనిపిస్తూ ఉంటుంది. 

 

 

 అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి... అలాంటి సింప్లిసిటీ నే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే... అందులో బ్లాక్ బస్టర్ విజయం సాధించినవి కూడా కొన్ని సినిమాలే... కానీ అభిమానులు మాత్రం కొంతమంది కాదు... టాలీవుడ్ లో ఏ హీరోకి లేని  ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం... ఏ హీరో ని కూడా ఆరాధించినంతగా అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ దేవుడు అంటారు... ఇంకొంతమంది పవర్ స్టార్ అంటారు.. మరికొంతమంది మా బలం అంటారు... ఇలా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక అభిమాని గుండెల్లో గుడి కట్టుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ టాలీవుడ్ బాద్షా నే.

మరింత సమాచారం తెలుసుకోండి: